World Most Polluted Cities: ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను పరిశీలించే స్విస్ వాయు నాణ్యత టెక్నాలజీ సంస్థ (IQAir) ఇటీవల విడుదల చేసిన 2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం.. అస్సాంలోని బర్నిహాట్ (Byrnihat) నగరం భారత్ లోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో ఐదవ అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. ముఖ్యంగా, భారతదేశంలోని నగరాల్లో సూక్ష్మ ధూళి రేణువుల స్థాయి PM2.5లు చాలా అధికంగా…
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధన్‌ఖడ్‌ను క్రిటికల్ కేర్ యూనిట్లో చేర్చారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలువురు ముఖ్య నేతలను కలవనున్నారు. మరోవైపు.. “ఇండియా టుడే” మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. మీరు కన్ఫ్యూజ్ అయినట్టే మేము మూడు లక్షల కోట్లే అప్పు అనుకున్నాం.. కానీ లెక్కలు చూస్తే రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని అన్నారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (మార్చ్ 7) ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా వెళ్లబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరుస ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు.. ఇవాళ ఢిల్లీలో కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం వివిధ కేంద్ర పథకాల కింద సహాయం చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది..
Jagga Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్సీ అడుగుతలేను.. నేను అడగొద్దు కూడా అన్నారు.
PM Modi: భారతదేశ ఉత్పత్తులు వరల్డ్ వైడ్ గా తమ ఉనికిని చాటుకుంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అనే తన ప్రచారం ఫలితం ఇస్తోందని చెప్పుకొచ్చారు. పలు ఆవిష్కరణలకు మనదేశం వేదిక అవుతోందని పేర్కొన్నారు.
ప్రపంచ ప్రజలు భారత్ వైపు చూస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్ఎక్స్టీ కాన్క్లేవ్లో మోడీ పాల్గొని ప్రసంగించారు. భారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్నాయని చెప్పారు. ప్రపంచం మొత్తం భారత్ గురించి ఆసక్తిగా గమనిస్తోందని వ్యాఖ్యానించారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వర్షం పడడంతో ఉద్యోగులు డ్యూటీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇక రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Amit Shah: ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీయలు, రోహింగ్యాలే టార్గెట్‌గా ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలు, అభివృద్ధి అంశాలపై ఆయన సమావేశం నిర్వహించారు. సమీక్షకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఢిల్లీ హోం శాఖ మంత్రి ఆశిష్ సూద్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. ఢిల్లీని సేఫ్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలని అమిత్ షా ఆదేశించారు.