Amit Shah: ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీయలు, రోహింగ్యాలే టార్గెట్గా ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలు, అభివృద్ధి అంశాలపై ఆయన సమావేశం నిర్వహించారు. సమీక్షకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఢిల్లీ హోం శాఖ మంత్రి ఆశిష్ సూద్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. ఢిల్లీని సేఫ్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలని అమిత్ షా ఆదేశించారు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. "తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక నేనా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా? తెలంగాణ క సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో నేను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకొస్తున్నా. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారు.
ఉత్తర భారత్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో రేఖా గుప్తా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి లేఖ రాశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే పథకం గురించి చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫిబ్రవరి 23న ఆప్ శాసనసభా పక్షాన్ని కలవడానికి సమయం ఇవ్వాలని లేఖలో రేఖా గుప్తాను కోరారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అలాగే ఉప రాష్ట్రపతి ధన్కర్ను కూడా కలిశారు. అనంతరం కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత ప్రధాని మోడీ తనకు పెద్దన్న లాంటివారని భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ను మోడీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి ఈ సదస్సు ప్రారంభించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని మీడియా కోడైకూసింది.
21వ శతాబ్దంలో జన్మించిన తరం ‘అమృత తరం’ కానుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ను మోడీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి ఈ సదస్సు ప్రారంభించారు.