Hyderabad: అందుబాటులోకి మరో అర్బన్ పార్క్.. గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటన..
- హైదరాబాద్‌లో మరో అర్భన్ పార్క్ అందుబాటులోకి..
- గుర్రంగూడ అటవీ భూములను ఫారెస్ట్ రిజర్వ్‌గా మార్పు..
- ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరవాసులకు ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది. నగర శివార్లలో మరో భారీ పచ్చని ప్రదేశం ‘అర్బన్ ఫారెస్ట్ పార్క్’ రూపంలో అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి తెరదించుతూ, ఆమన్గల్ డివిజన్ పరిధిలోని గుర్రంగూడ అటవీ భూములను ’రిజర్వ్ ఫారెస్ట్’గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నగర పర్యావరణానికి పెద్ద పీట వేయనుంది. సుమారు 424 ఎకరాల 31 గుంటల భారీ విస్తీర్ణంలో ఈ అటవీ భూభాగం విస్తరించి ఉంది. తెలంగాణ ఫారెస్ట్ చట్టం–1967లోని సెక్షన్ 15 ప్రకారం.. పర్యావరణ, అటవీ శాఖ G.O.Ms.No.7 ద్వారా ఈ హోదాను కల్పించింది. ఈ భూముల్లోని సాహెబ్‌నగర్ కలాన్ గ్రామానికి చెందిన 102 ఎకరాలపై సుదీర్ఘ కాలంగా కోర్టులో వివాదం నడిచింది. దీనిని ‘సాహెబ్‌నగర్ కలాన్ కేసు’గా పిలుస్తారు. చివరకు సుప్రీంకోర్టు అటవీ శాఖ వాదనను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో ఆక్రమణదారుల నుంచి ఈ భూమికి విముక్తి లభించింది.
Also Read:Gas Effect: గ్యాస్ కొరత.. పెరిగిన హోటల్ ఫుడ్ ఐటమ్స్ ధరలు..
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో… ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించే ‘గ్రీన్ లంగ్ స్పేస్’గా దీనిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకుల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ కుటుంబాలతో కలిసి వారాంతాల్లో సమయాన్ని గడిపేలా విశ్రాంతి ప్రదేశాలు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు రానున్నాయి. అడవుల ప్రాముఖ్యతను వివరించేలా నాలెడ్జ్ సెంటర్లను ఇక్కడ నిర్మించే అవకాశం ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ హోదా రావడం వల్ల ఇక్కడ ఉన్న స్థానిక వృక్ష సంపద, జీవవైవిధ్యానికి చట్టపరమైన రక్షణ లభిస్తుంది. ఇకపై ఇక్కడ ఎలాంటి అనధికారిక నిర్మాణాలు లేదా ఆక్రమణలకు తావు ఉండదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే ఉన్న గజ్వేల్, శామీర్‌పేట వంటి అర్బన్ పార్కుల తరహాలోనే.. గుర్రంగూడ పార్క్ కూడా బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, సాగర్ రోడ్ ప్రాంతాల వారికి ప్రధాన పర్యాటక కేంద్రంగా మారనుంది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!