Former CM Atishi: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి అతిషి తీవ్ర విమర్శలు గుప్పించారు. కమలం సర్కార్ వచ్చిన వెంటనే హస్తినాలో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఆప్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ ప్రజలు ఇన్వర్టర్లు, జనరేటర్లను మరచిపోయారని పేర్కొన్నారు. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీలో చాలా సేపు కరెంట్ కోతలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి.. దీని వల్ల విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుందని ప్రభుత్వం గుర్తించడం లేదని అతిషి ఎద్దేవా చేసింది.
Read Also: Mullapudi Brahmanandam: సినీ పరిశ్రమలో విషాదం.. నిర్మాత మృతి!
అయితే, గత సంవత్సరం ఈ రికార్డు 8,656 మెగావాట్లకు చేరుకోగా.. ఈసారి దీని డిమాండ్ తొమ్మిది వేల మెగావాట్లకు మించి చేరుకుంటుందని మాజీ సీఎం అతిషి తెలిపింది. మార్చి నుంచి వేసవికాలం ముగిసే వారకు విద్యుత్ కి డిమాండ్ ఉంటుంది.. గరిష్టంగా 4,361 మెగావాట్లకు చేరుకుంది.. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లను ప్రజలు బాగా ఉపయోగిస్తున్నారు.. దీంతో కరెంట్ ఉత్పత్తి పెరిగిందన్నారు.
Read Also: Subham Teaser: శోభనం గదిలో ట్విస్ట్.. ఇంట్రెస్టింగ్‍గా సమంత ‘శుభం’ మూవీ టీజర్!
ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ ఇంధన శాఖ మంత్రి ఆశిష్ సూద్ ఖండించారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగుతుంది.. వేసవి కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. కరెంట్ కోతలు లేకుండా పని చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ కంపెనీలు కూడా తగినంత విద్యుత్ లభ్యతను నిర్ధారించుకున్నాయి.. విద్యుత్ నెట్‌వర్క్ కూడా మరమ్మతు చేయబడిందని మంత్రి ఆశిష్ సూద్ చెప్పుకొచ్చారు. కాగా, 2022వ ఏడాది మార్చిలో 4,648 మెగావాట్లుగా నమోదైంది. ఇక, గత ఏడాది మార్చి 31న గరిష్ట డిమాండ్ 4,482 మెగావాట్లతో పోలిస్తే, ఈసారి డిమాండ్‌లో కొంత తగ్గుదల కనిపిస్తుందని విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులు తెలిపారు. కానీ, ఏప్రిల్‌లో డిమాండ్ ఐదు వేల మెగావాట్లకు మించి చేరే అవకాశం ఉందన్నారు.