Former CM Atishi: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి అతిషి తీవ్ర విమర్శలు గుప్పించారు. కమలం సర్కార్ వచ్చిన వెంటనే హస్తినాలో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు.
ప్రధాని మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీని కేంద్రం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. 2022, నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో డిప్యూటీ సెక్రటరీగా నిధి తివారీ పనిచేస్తున్నారు.
శక్తివంతమైన భూకంపాలతో గజగజలాడిన మయన్మార్, థాయిలాండ్‌కు కష్టకాలంలో సాయం చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. శుక్రవారమే అండగా ఉంటామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మోడీ పిలుపు మేరకు భారత విదేశాంగ శాఖ చొరవ చూపించింది.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారీ భూకంపాలతో హడలెత్తిపోయాయి. ఈ ఉదయం బ్యాంకాక్, మయన్మార్‌లో పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో భారీ అంతస్తుల బిల్డింగ్లు నేలకూలిపోయాయి. భయంతో జనాలు పరుగులు తీశారు.
భారత్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్‌లోంచి బయటకు వచ్చేశారు. అలాగే అధికారులు కూడా కార్యాలయాల్లోంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది.
అరకు కాఫీకి ఎంత విశిష్టత ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మరింత ఖ్యాతి గడించబోతుంది. సోమవారం లోక్‌సభ క్యాంటీన్లో అరకు స్టాల్ ప్రారంభం అయింది. వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ స్టాల్‌ను ప్రారంభించారు.
చట్టం తెలిసివాళ్లే.. చట్టాన్ని మీరితే ఇంకేమీ న్యాయం జరుగుతుంది. ఉన్నతమైన స్థానంలో కూర్చుని తీర్పులు చెప్పే న్యాయమూర్తులే గాడి తప్పుతున్నారు. న్యాయశాఖకే మచ్చ తెచ్చిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రెడీమేడ్ దుస్తుల వ్యాపారి మోహిందర్ సింగ్, అతని భార్య దిల్జీత్ కౌర్ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఇంట్లో శవాలుగా పడి ఉన్నారు. దంపతుల నివాసానికి సమీపంలోనే ఇద్దరు కుమారులు, కుమార్తె నివాసం ఉంటుంది.