CM Revanth Reddy: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న బీసీ సంఘాలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ఏకం చేసేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు అని తెలిపారు. ఈ సందర్భంగా అందరి కష్టసుఖాలు తెలుసుకున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని అప్పుడు రాహుల్ హామీ ఇచ్చారు. ఇక, బీసీ బిల్లుకు ఆలోచన, స్పూర్తి రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ జోడో యాత్రలో బలహీన వర్గాలు తమ జనాభా లెక్క గురించి అడిగారు.. జనగణన తో పాటూ కుల గణన జరగాలని కాంగ్రెస్ విధాన పరమైన నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Ram Charan : కెరీర్ హయ్యెస్ట్ ధరకు’పెద్ది ‘ మ్యూజిక్ రైట్స్ డీల్ క్లోజ్..
ఇక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ ఇచ్చిన మాటను నిలబెట్టే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉంది.. నేను ఏ సామాజిక వర్గమైన, ఎటువంటి వంటి ఒత్తిడి ఉన్నా.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దీనిపై తీర్మానం చేశాం.. బీసీ గణన మొదలు పెట్టాం.. ఫిబ్రవరి 4వ తేదీని సోషల్ జస్టిస్ డే గా నిర్ణయించామన్నారు. ఇక, భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకం.. మండల కమిషన్ కు వ్యతిరేకంగా కుట్ర చేసింది బీజేపీ అని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉండాలి, చెయ్యాలనే సంకల్పం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు.