రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఆమె అస్వస్థతకు గురయ్యారు.
రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. పొత్తికడుపు సంబంధిత సమస్యతో ఆమె గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి.
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు హాజరయ్యారు.. ఇక, ఇదే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.. అయితే, ఆ వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఆసక్తికర చర్చ సాగింది.. మొత్తానికి పవన్…
Eaknath Shinde : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు హత్య బెదిరింపు కేసు వెలుగులోకి వచ్చింది. గోరేగావ్ పోలీసులకు ఒక తెలియని వ్యక్తి నుండి ఒక ఇమెయిల్ వచ్చింది.
NDA CMs Key Meeting: ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం దేశ రాజధానిలోని ఓ హోటల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె సీఎం పదవిని చేపట్టారు. రామ్‌లీలా మైదానంలో ప్రజల సమక్షంలో రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమం జరిగింది.
Delhi Assembly speaker: ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ.. అసెంబ్లీ స్పీకర్ పదవికి భారతీయ జనతా పార్టీ తరపున రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా నామినేట్ అయ్యారని పార్టీ నాయకులు తెలిపారు.
Rekha Gupta: అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో శీష్ మహల్ పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ఆ భవనాన్ని మ్యూజియంగా మారుస్తామని ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నెరవేరుస్తాం..
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు యూఎస్ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. యూఎస్ ప్రతినిధులతో జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్‌పై అవగాహన ఒప్పందం జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12:30 వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్‌పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. వివిధ శాఖల సమీక్షలో బడ్జెట్‌పై ఆర్ధిక శాఖ కసరత్తు చేయనుంది. సీఎం చంద్రబాబు సూచనలతో సంక్షేమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనుంది.…
ఢిల్లీలో ప్రధాని మోడీని యూకే మాజీ ప్రధాని రిషి సునక్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మోడీతో రిషి సునక్ ప్రత్యేకంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంగళవారం మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు