ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు. ఏపీకి గేట్స్ ఫౌండేషన్ సహకారంపై బిల్ గేట్స్‌తో సీఎం సుదీర్ఘంగా చర్చించనున్నారు. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా బిల్ గేట్స్ ఉన్నారు. ఏపీకి వివిధ రంగాల్లో సహాయ సహకారాలు…
ఎన్నికల పారదర్శకతపై పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలను డాటాను విశ్లేషించింది. మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది అఫిడవిట్లను పరిశీలించింది. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసింది. గత ఐదు సంవత్సరాలలో వేరే పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి.. పార్టీ మారిన 63 మంది ఎమ్మెల్యేల జాబితా కూడా రూపొందించింది. ఎమ్మెల్యేల నేర నేపథ్యం, వారి ఆస్తుల వివరాల గురించి…
దేశ ప్రజల సహకారంతో మహా కుంభమేళా విజయవంతమైందని ప్రధాని మోడీ అన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసగించారు. కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభమేళాతో దేశ ప్రజలను ఐక్యం చేసిందని చెప్పారు. అలాగే భారత శక్తిని ప్రపంచమంతా చూపించామని మోడీ స్పష్టం చేశారు.
నేడు దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. సాయంత్రం 6.30కి సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈరోజు రాత్రికి ఇద్దరు ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే…
Telangana CM: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. దానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో ఇవాళ చర్చిస్తాను.. డీలిమిటేషన్ అనేది సౌత్ ను లిమిటేషన్ చేయడానికే.. డీలిమిటేషన్ పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కచ్చితంగా హాజరు కావాలన్నారు
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతోంది.. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించాలి అని డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం.. ఈ నెల 22వ తేదీన స్టాలిన్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటాం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్నేహం ముసుగులో యూకేకు చెందిన మహిళా పర్యాటకురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడి స్నేహితుడు కూడా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నాడు రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు (మార్చ్ 13) ఉదయం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో రేవంత్ సమావేశం కానున్నారు.