Earthquake: శుక్రవారం నేపాల్‌లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. నేపాల్‌లో వచ్చిన భూకంపం ప్రభావంతో హిమాలయాలను అనుకుని ఉన్న రాష్ట్రాల్లో, ఢిల్లీలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం రాత్రి 7.52 నిమిషాలకు సంభవించింది, దాని కేంద్రం 20 కి.మీ లోతులో ఉనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Read Also: Peddi: ఇట్స్ అఫిషియల్.. రెహమాన్ మ్యాజిక్‌తో స్పెషల్ గ్లింప్స్..
మయన్మార్, థాయ్‌లాండ్‌లను పెద్ద భూకంపం కుదిపేసిన తర్వాత కొద్ది రోజులకే నేపాల్‌లో భూకంపం సంభవించింది. మయన్మార్ భూకంపం వల్ల ఇప్పటికే మృతుల సంఖ్య 3000లను దాటింది. 4715 మంది గాయపడినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 341 మంది ఇప్పటికీ కనిపించడం లేదు.