Tahawwur Rana: ఢిల్లీ చేరుకున్న తహవూర్ రాణా.. భారీ బందోబస్తు ఏర్పాటు
- ఢిల్లీకి చేరుకున్న తహవూర్ రాణా
- పాటియాలా కోర్టు దగ్గర భద్రత పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవూర్ రాణా ఢిల్లీ చేరుకున్నాడు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో రాణాను ఢిల్లీకి తీసుకొచ్చారు. రాణాను న్యాయస్థానం ఎదుట హాజరు పరచనున్నారు. పాటియాలా కోర్టు దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రయల్ కోర్టు రికార్డులను ఇప్పటికే పాటియాలా కోర్టుకు తరలించారు.
ఇక ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల కాలానికి లేకపోతే ట్రయల్ పూర్తయ్యేవరకు ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అప్పిలేట్ కోర్టుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించనున్నారు. ఏది ముందుగా పూర్తయితే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. ఉగ్ర దాడుల్లో కీలక పాత్ర పోషించాడన్న ఆరోపణలపై 2009లో అరెస్టయ్యాడు. గత కొంత కాలంగా తహవూర్ రాణా అమెరికా జైల్లో మగ్గుతున్నాడు. అయితే ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించాలని ట్రంప్‌ను కోరారు. మొత్తానికి మోడీ చేసిన దౌత్యం ఫలించింది. అయితే తనను భారత్‌లో హింసిస్తారని.. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టులో నిందితుడు వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో రాణా భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయింది.
తాజావార్తలు
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!