మనీలాండరింగ్ కేసులో రెండోరోజు విచారణకు ఈడీ కార్యాలయానికి రాబర్ట్ వాద్రా వచ్చారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం ఎదుట ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విచారణకు వెళ్లే ముందు రాబర్ట్ వాద్రాను భార్య ప్రియాంకాగాంధీ కౌగిలించుకుని లోపలికి పంపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Gurugram: దారుణం.. వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్‌హోస్ట్‌పై అత్యాచారం
గురుగ్రామ్ భూమి కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వరుసగా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనికి వెళ్లారు. 2008 హర్యానా భూ ఒప్పందం, మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ఈడీ విచారిస్తోంది. మంగళవారం దాదాపు ఐదు గంటల పాటు విచారించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PLMA) కింద ఆయన వాంగ్మూలాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Supreme Court: చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు.. సుప్రీం ఆగ్రహం