బీహార్‌లో దారుణం జరిగింది. పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. కుమార్తె వేరే కులం యువకుడితో ఢిల్లీ పారిపోయిందని తండ్రి పగతో రగిలిపోయాడు. దీంతో ఆమె జాడ కోసం వెతకాడు. మొత్తానికి కుమార్తెను ఒప్పించి ఇంటికి తీసుకొచ్చాక దారుణంగా హతమార్చాడు.
ముఖేష్ సింగ్.. మాజీ సైనికుడు. బీహార్‌లోని సమస్తిపూర్‌లో నివాసం ఉంటారు. కుమార్తె సాక్షి (25) అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఏప్రిల్ 4న ప్రియుడితో కలిసి ఢిల్లీకి పారిపోయింది. అయితే కుమార్తెను వెతుక్కుంటూ వెళ్లి కుమార్తెను తిరిగి గ్రామానికి తీసుకొచ్చాడు. అనంతరం ఏప్రిల్ 7న కుమార్తెను చంపి బాత్రూమ్‌లో దాచి పెట్టాడు. అయితే కుమార్తె ఎక్కడా అని భార్య.. ముఖేష్ సింగ్‌ను నిలదీయగా సమాధానం చెప్పలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బుధవారం రాత్రి బాత్రూమ్‌లో సాక్షి మృతదేహాన్ని గుర్తించారు. వేరు కులం వాడిని ప్రేమించినందుకే ముఖేష్ సింగ్ చంపినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ముఖేష్ సింగ్.. కుమార్తెను వెంబడించాడని.. చాలా రోజులు గ్రామంలో కనిపించలేదని సాక్షి మామ విపిన్ కుమార్ తెలిపారు. ఇద్దరూ కూడా ఒకే కాలేజీలోనే చదువుతున్నారని వెల్లడించాడు. యువకుడు కూడా సాక్షి ఇంటి దగ్గరే నివాసం ఉంటున్నట్లు చెప్పాడు.
#मोहिउद्दीनगर थाना क्षेत्र से संबंधित…@bihar_police@bihar_iprd@ANI#samastipur #samastipurpolice #BiharPolice #HainTaiyaarHum pic.twitter.com/27T4ml5i8l
— Samastipur Police (@Samastipur_Pol) April 10, 2025