Nitin Gadkari: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హస్తినలో మూడు రోజులుంటే చాలు వ్యాధి రావడం ఖాయమన్నారు. కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై రెడ్జోన్లో ఉన్నాయని పేర్కొన్నారు.
26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను గురువారం ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం పాటియాలా ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.
బీహార్లో దారుణం జరిగింది. పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. కుమార్తె వేరే కులం యువకుడితో ఢిల్లీ పారిపోయిందని తండ్రి పగతో రగిలిపోయాడు. దీంతో ఆమె జాడ కోసం వెతకాడు. మొత్తానికి కుమార్తెను ఒప్పించి ఇంటికి తీసుకొచ్చాక దారుణంగా హతమార్చాడు.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవూర్ రాణా ఢిల్లీ చేరుకున్నాడు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో రాణాను ఢిల్లీకి తీసుకొచ్చారు. రాణాను న్యాయస్థానం ఎదుట హాజరు పరచనున్నారు.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను అమలుచేసేందుకు రెడీ అవుతుంది.
దేశంలో పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం భారీగా వేడిగాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి గాలులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఉత్తర భారత్కు ఐఎండీ హీట్వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి మూడు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలో వేడిగాలులు వీస్తాయని తెలిపింది
Earthquake: శుక్రవారం నేపాల్లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. నేపాల్లో వచ్చిన భూకంపం ప్రభావంతో హిమాలయాలను అనుకుని ఉన్న రాష్ట్రాల్లో, ఢిల్లీలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం రాత్రి 7.52 నిమిషాలకు సంభవించింది, దాని కేంద్రం 20 కి.మీ లోతులో ఉనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
CM Revanth Reddy: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న బీసీ సంఘాలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ఏకం చేసేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు అని తెలిపారు. ఈ సందర్భంగా అందరి కష్టసుఖాలు తెలుసుకున్నారు.