ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది… ప్రతిపక్ష నేతలు, సీనియర్ జర్నలిస్టులు, ప్రముఖులతో పాటు.. కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్‌కు గురికాడంతో ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి.. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఫోన్లు ట్యాప్ చేస్తూ.. అభద్రతకు గురిచేస్తున్నారన్న ఆయన.. పెగాసస్ స్పైవేర్ ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారని.. రాహుల్ గాంధీ, ఆయన కార్యాలయంలోని సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు.. ఇది భద్రత పట్ల ఆందోళనకు తెర లేపుతోంది.. ఈ వ్యవహారంపై మౌనం వీడి ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..
అనేక మీడియా సంస్థల మీద కూడా కేంద్రం నిఘా ఉందని.. కేంద్రంతో పాటు… రాష్ట్రం కూడా చాలా మంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లు భట్టివిక్కమార్క.. ప్రజాస్వామ్య ఉనికి ప్రమాదకరంగా మారిందన్న ఆయన.. న్యాయ వ్యవస్థలో ఉన్న వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు.. ప్రధాని మోడీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు దళిత బంధు పథకంపై స్పందించిన భట్టి.. దళిత బంధు రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అంశం.. హుజురాబాద్‌కే పరిమితం చేయొద్దని.. అలా చేస్తే ఎన్నికల కోసమే చేసినట్టు భావించాల్సి ఉంటుందన్నారు.