దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా వైరస్ రోజువారి పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. మృతుల సంఖ్య మాత్రం ఇంకా బయపెడుతూనే ఉంది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటలలో 576 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకేరోజు మరో 103 మంది మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,287 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవడం ఊరటనిచ్చే అంశమే.. దీంతో. ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్…
కరోనా వల్ల లాక్డౌన్ ఆంక్షలను ఢిల్లీలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మందుప్రియులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మద్యం హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ఆన్లైన్లో దేశీయ, విదేశీ మద్యం విక్రయించుకునే వెసలుబాటు కల్పించింది. వెబ్‌పోర్టల్ లేదా యాప్ ద్వారా మద్యం ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. భారతీయ కంపెనీలకు చెందిన మద్యం కానీ.. విదేశాలకు చెందిన మద్యాన్ని అయినా ఇంటికి డెలివరీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే హాస్టళ్లు, ఆఫీసులు,…
ఢిల్లీలో బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డాతో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్, రాష్ట్ర బిజేపి ఇంచార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపి వివేక్ వేంకటేస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జె.పి నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. బిజేపిలో చేరాలన్న ఈటల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… తెలంగాణలో బిజేపి మరింత చురుకైన పాత్ర పోషిం చేందుకు సమాయత్తం కావాలని రాష్ట్ర నాయకులకు నడ్డా సూచించారు. ఉద్యమ నాయకులతో పార్టీ…
బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా నివాసంలో ఈ రోజు కీలక సమావేశం జరుగనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జె.పి. నడ్డాతో ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలను నడ్డాకు వివరించనున్నారు ఈటల రాజేందర్. ఇప్పటికే బిజేపిలో చేరేందుకు రంగం సిద్దం కాగా.. బిజేపిలో తాను నిర్వహించాల్సిన పాత్రపై చర్చిం చనున్నారు. తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు రాష్ట్ర బిజేపిలో తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పించే అంశంపై…
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.. ఇది చాలా ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. సెంట్రల్ విస్టా పనులను ఆపాలంటూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ తప్ప పిల్ కాదని పేర్కొంది.. అంతేకాదు పిటిషనర్లకు రూ.లక్షల జరిమానా కూడా విధించింది. సంబంధిత…
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని కొన్ని రేజులు పెట్రో ధరల పరుగుకు కళ్లెం పడింది.. కానీ, ఎన్నికల ముగిసి.. ఫలితాలు వెలువడిన తర్వాత మళ్లీ వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి.. డీజిల్ ధర రూ.95 వరకు చేరింది.. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, లీటర్ డీజిల్‌పై 24 పైసల చొప్పున వడ్డించాయి చమురు సంస్థలు.. దీంతో ఢిల్లీలో పెట్రోల్,…
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం, మృతుల సంఖ్య కూడా భారీగా ఉండడంతో.. అప్రమత్తమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. లాక్డౌన్ ప్రకటించారు.. కేసులు అదుపులోకి రాకపోవడంతో క్రమంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వచ్చారు. అక్కడ లాక్డౌన్ మంచి ఫలితాలను ఇచ్చింది.. ఇప్పుడు కరోనా పాజిటివిటీ రేటు 1.5 శాతానికి పడిపోయింది.. దీంతో.. ఈ నెల 31వ తేదీ నుంచి దశలవారీగా అన్‌లాక్‌కు వెళ్లనున్నట్టు వెల్లడించారు…
ఢిల్లీలో ఓ యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన పనికి కటకటాలపాలయ్యాడు. ఢిల్లీకి చెందిన యూట్యూబర్ గౌరవ్ శర్మ ఇటీవల తన పెంపుడు కుక్కను.. హైడ్రోజన్ బెలూన్లకు కట్టి వీడియోను తయారు చేశాడు. వాటితో కలిపి కుక్కను ఎగరవేసాడు. అది కాస్తా వైరల్‌గా మారడంతో చూసినవాళ్లంతా ఆ యూట్యూబర్‌పై విమర్శలు చేశారు. అంతేకాదు, జంతు ప్రేమికులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆ యూట్యూబర్ పై పోలీస్ కేసు నమోదు అయింది. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఓ వైపు…
మంగళవారం రోజు .. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను నియమించిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగున్నారు జైస్వాల్.. మహారాష్ట్ర క్యాడర్ 1985 బ్యాచ్‌కు చెందిన ఈ ఐపీఎస్ ఆఫీసర్.. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించినా.. చివరకు ప్యానల్ సుబోధ్ కుమార్ జైస్వాల్ వైపు…