ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద రైతులు ధర్నా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే “సంయుక్త కిసాన్ మోర్చా”, “కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ” కు చెందిన 200 మంది గుర్తింపు కార్డులు కలిగిన రైతులకు మాత్రమే ధర్నా చేయటానికి అనుమతి ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద రైతుల ధర్నాకు అనుమతి ఇచ్చారు. జూలై 22 నుండి ఆగష్టు 9 వరకు శాంతియుత పద్ధతులలో “కరోనా” నియమ నిబంధనలు పాటిస్తూ ధర్నా చేయడానికి అనుమతి ఇచ్చాఉ. ఈ మేరకు రైతుల నుంచి రాతపూర్వక హామీ తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. జనవరి 26 ఘటన మరోసారి పునరావృతం కాకుండా భారీగా భద్రత ఏర్పాటు చేసింది ఢిల్లీ పోలీసు యంత్రాంగం. దేశ రాజధాని కి దారితీసే అన్ని రహదారుల వద్ద గట్టి బందోబస్తు, నిరంతర నిఘా ఉండనుంది.