బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి… 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య.. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ.. పార్లమెంట్ ముట్టడికి వెళ్తున్న బీసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య.. బీసీల పట్ల కేంద్ర వైఖరిని ఖండిస్తున్నాం.. బీసీ బిల్లు ప్రవేశ పెట్టకపోతే లక్ష మందితో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.. మా న్యాయమైన డిమాండ్ ను అడుగుతున్నాం.. బిచ్చం అడగడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కృష్ణయ్య.. రంగాలవారీగా బీసీలకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు.. రిజర్వేషన్లు, బీసీ బిల్లు కోసం 70 కోట్ల మంది బీసీలు గొంతెత్తుతున్నారని.. గతంలో ఎన్నడూ లేని రీతిలో 27 మంది బీసీలకు కేంద్రమంత్రివర్గంలో స్థానం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.