భారత అత్యున్నత న్యాయస్తానం సుప్రీంకోర్టులో 9 మందిని జడ్జీలుగా నియమించే అవకాశం ఉన్నది. దీనికి సంబందించి కొలీజియం 9 మంది పేర్లను సిఫారసు చేసింది. జస్టిస్ ఏఎస్ ఓకా(కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్), జస్టిస్ విక్రమ్‌నాథ్ (గుజరాత్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్), జస్టిస్ జేకే మహేశ్వరి (సిక్కం హైకోర్ట్ చీఫ్ జస్టిస్), జస్టిస్ హిమా కొహ్లీ(తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్), జస్టిస్ బీవీ నాగరత్న( కర్ణాటక హైకోర్ట్ జడ్జి), జస్టిస్ సీటీ రవికుమార్ (కేరళ హైకోర్ట్ జడ్జి), జస్టిస్ ఎంఎం సుందరేష్ (మద్రాస్ హైకోర్ట్ జడ్జి), జస్టిస్ బేలా ఎం త్రివేది (గుజరాత్ హైకోర్ట్ జడ్జి), పి.ఎస్ నరసింహ (సీనియర్ అడ్వకేట్) పేర్లను కొలీజియం ప్రభుత్వానికి సిఫారసు చేసింది.