సుప్రీంకోర్టు ఎదుట ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది… ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలోని గేట్ డి వద్ద మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో.. ఒక పురుషుడు, మహిళ తమ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు.. మంటలు అంటుకున్న తర్వాత.. సుప్రీంకోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు యత్నంచారు.. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇక, వెంటనే స్పందించిన పోలీసులు.. మంటలను ఆర్పివేశారు. గాయాలపాలైన ఆ ఇద్దరనీ ఆస్పత్రికి తరలించారు.. మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. పురుషుడి కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిద్దరు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అసలు వారు ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చారు..? ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారు అనేదానిపై ఆరా తీస్తున్నారు ఢిల్లీ పోలీసులు.