మళ్లీ ఢిల్లీకి సీఎం కేసీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల ఆరంభంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. హస్తినలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్షా సహా పలువురు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తదితరులను కలిశారు.. ఓవైపు రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూనే.. మరోవైపు.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.. అయితే, మరోసారి హస్తినకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.. ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న ఆయన.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు.. ఈ సమావేశం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన జరగనుంది.. అయితే, గతంలో జరిగిన ఈ సమావేశానికి కేసీఆర్ హాజరుకాకపోవడంతో.. విమర్శలు కూడా వచ్చాయి. ఇక, ఈ పర్యటనలో.. ఇంకా ఎవరినైనా కలిసే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఒకే నెలలో రెండోసారి తెలంగాణ సీఎం.. ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!