సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 8 రోజులుగా ఢిల్లీలో బిజీబిజీ గా ఉన్న సీఎం కేసీఆర్…. ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ బయల్దేరనున్నారు. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసిఆర్…. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై రాష్ట్ర సమస్యలు, అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహాయం పై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇద్దరు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలలో పాల్గొన్న తెలంగాణ సీఎం… కేంద్ర రహదారుల మంత్రి…
ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు హస్తిన బాట పట్టారు.. త్వరలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.. ఈలోపే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు.. మొదట ప్రహ్లాద్ జోషితో సమావేశంకానున్న ఆయన.. ఆ తర్వాత తన పర్యటనలో పలువురు బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది.…
తెలంగాణ పొలిటికల్ హీట్ ఇప్పుడు హస్తిన తాకింది.. తన పాదయాత్రకు ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లి వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తినబాట పట్టారు.. కొత్త పీసీసీ చీఫ్‌ను.. కొత్త కమిటీలను ప్రకటించిన తర్వాత తొలిసారి అందరితో సమావేశం అయ్యేందుకు సిద్ధం అయ్యారు రాహుల్ గాంధీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీతో టి.కాంగ్రెస్ నేతలు భేటీ…
హాలీవుడ్ లో యాంట్స్ అనే సినిమా వచ్చింది గుర్తుంది కదా. ఆ సినిమాలో విమానం ప్రయాణం చేస్తుండగా భయానకమైన చీమలు దాడులు చేస్తాయి. విమానం లోపల జరిగే ఆ సీన్స్ నిజంగా తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇలాంటి సంఘటనే న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. ఢిల్లీ నుంచి ఏఐ111 విమానం లండన్‌కు వెళ్లాల్సి ఉన్నది. మొత్తం 248 ప్రయాణికులతో టెకాఫ్ కావడానికి సిద్దంగా ఉన్నది. అందులో భూటాన్ యువరాజు కుడా ఉన్నారు. ఉన్నట్టుండి బిజినెస్ క్లాస్లోనుంచి ప్రయాణికులు పెద్ద…
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్… నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమైన ఆయన… కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. KRMB, GRMBల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కావాలని… అప్పటి వరకు రెండు బోర్డులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆరు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్… వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారు. నిన్న…
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కొల్హాపూర్, సోమశిల, కరువేన గుండా ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యా వరకు (ఎన్.హెచ్ 167 కే. జాతీయ రహదారి నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఈ జాతీయ రహదారి వల్ల తెలంగాణలోని కల్వకుర్తి, కొల్హాపూర్, సోమశిల, ఆంధ్ర ప్రదేశ్ లోని ఆత్మకూరు లాంటి వెనుక…
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఆరోరోజుకు చేరింది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, విభజన హామీల అమలు, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు సహా పదికి పైగా కీలకాంశాలను కేంద్రం ముందుంచారు సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ…
కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వాటితో దీర్ఘకాలంలో రైతులకు చాలా మేలు జరుగుతుందని చెబుతూ వస్తోంది.. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘకాలంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నా.. మొదట్లో చర్చలు జరిపినట్టే జరిపి.. ఆ తర్వాత లైట్ తీసుకుంది కేంద్రం.. అయితే, ఉన్నట్టుండి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళలన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు వరుణ్ గాంధీ… రైతుల బాధలను కేంద్రం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. హస్తినలో మకాం వేశారు.. మొదట మూడు రోజుల పర్యటన అంటూ ఢిల్లీ బయల్దేరిన సీఎం.. ఇప్పుడు హస్తిన పర్యటనను పొడిగించారు.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన ఆయన.. ఇవాళ కూడా ఢిల్లీలోనే బస చేయనున్నారు.. రేపు మరికొన్ని భేటీలు జరగనున్నట్టు తెలుస్తోంది.. సోమవారం రోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసే అవకాశం ఉండగా.. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల జల వివాదాలు, కేంద్ర గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా భవనం ఏర్పాటు స్థలాన్ని కేటాయించాలని మోడీని కేసీఆర్ కోరారు. ఈ అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి…