దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిసాయి.. కుండపోత వర్షం దెబ్బకు వీధులు, రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఈ రోజు ఉదయం 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.. 13 ఏళ్లలో ఆగస్ట్ నెలలో ఒకే రోజు అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఈ భారీ వర్షంతో దేశ రాజధానిలో ఆరెంజ్ హెచ్చరిక జారీ…
తాలిబన్లు ఎంతటి కర్కశకులో చెప్పనలివి కాదు. మానవత్వం మచ్చుకైనా కనిపించదు. జాలి, దయ అన్నవి వారి నిఘంటువులో కనిపించవు. తెలిసందల్లా రక్తపాతం సృష్టించడం, ప్రజలకు భయపెట్టడం. బయటిప్రజలతోనే కాదు, ఇంట్లోని భార్య, బిడ్డలతో కూడా వారి ప్రవర్తన అలానే ఉంటుంది. దీనికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాలుగేళ్ల క్రితం చిన్న బిడ్డలను తీసుకొని పొట్ట చేత్తోపట్టుకొని ఇండియా వచ్చింది ఫరిభా అనే మహిళ. ఆఫ్ఘన్లో ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నదో…
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది.. ఆయన దివంగత భార్య సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ పై ఉన్న అభియోగాలను తోసిపుచ్చిన ఢిల్లీలోని సెషన్స్ కోర్టు.. ఇవాళ ఆయనకు నిర్ధోషిగా ప్రకటించింది… కాగా, సునంద పుష్కర్ 2014 జనవరిలో ఓ హోటల్ గదిలో శవమై కనిపించింది. ఆమె డ్రగ్స్ వాడినట్టు వైద్యుల నివేదిక సూచించింది. ప్రాథమిక విచారణలో ఇది హత్యా? కాదా ? అనే కోణంలో…
కాబూల్ నుంచి 129 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో వీరంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆఫ్ఘన్లో చిక్కుకుపోయిన మన వాల్లను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వెళ్లింది. అయితే, విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని తెలియడంతో ఆందోళన నెలకొంది. అలాగే, కాబూల్ ఎయిర్ పోర్టులో దిగేందుకు అనుమతిచ్చేందుకు ATC అందుబాటులో లేకపోవడంతో మరో ఉత్కంఠకు తెరలేచింది. అదే సమయంలో శత్రువులకు లక్ష్యంగా మారకూడదనే ఉద్దేశంతో విమాన…
సుప్రీంకోర్టు ఎదుట ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది… ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలోని గేట్ డి వద్ద మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో.. ఒక పురుషుడు, మహిళ తమ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు.. మంటలు అంటుకున్న తర్వాత.. సుప్రీంకోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు యత్నంచారు.. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇక, వెంటనే స్పందించిన పోలీసులు.. మంటలను ఆర్పివేశారు. గాయాలపాలైన ఆ ఇద్దరనీ ఆస్పత్రికి తరలించారు.. మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. పురుషుడి కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం…
భారీ కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పంద్రాగస్టు వేడుకల ముందు నలుగురు నిందితులను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 55 పిస్టల్స్, 50 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సాత్వంత్ర్య దినోత్సవం సంద్భంగా… ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాజ్వీర్ సింగ్, ధీరజ్, వినోద్ భోలా, ధర్మేంద్ర అనే నలుగురు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.…
కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్… 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలను ఇవాళ ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన దేశాన్ని అత్యుత్తమంగా, సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దాలని, మనం ఇతరులపై ముందుగా దాడి చేయకపోయినా, మనపై కన్ను వేసినవారికి దీటైన జవాబు ఇచ్చేవిధంగా అభివృద్ధి చేయాలన్నారు.. 2047లో మన దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటుంది..…
నేతల క్రిమినల్ రికార్డులపై రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు… ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఇది రాజకీయ నేతలకు ఇష్టం లేని అంశంగా ఉందని.. అందుకే సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రపతిని కలిసినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పెగాసెస్, రైతు చట్టాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. వీటిపై అధికారపక్షం కూడా పట్టుబడుతుండటంతో.. పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరగడంలేదు. అయితే తొలిసారి అధికార, విపక్షాలు.. ఒక్క తాటిపైకి వచ్చాయి. ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టే బిల్లుపై అధికార, విపక్షాలు ఒకేమాటపై నిలుస్తున్నాయి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి…