రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతిబాగ్ లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. అనంతరం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం, వృక్ష వేదం పుస్తక వివరాలు తెలుసుకొని ఎంపీ…
ఈరోజు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞన్ భవన్లో ఈ భేటీ జరుగుతున్నది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో భేటీ అమిత్‌షా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల గురించి…
హస్తిన పర్యటనలోఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో సమావేశం అయ్యారు… ఇవాళ సుమారు 40 నిముషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. అయితే, నెల రోజుల వ్యవధిలోనే షెకావత్‌తో కేసీఆర్ భేటీ కావడం ఇది రెండోసారి.. ఈ నెల 6న కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమైన కేసీఆర్.. 5 అంశాలపై విజ్ఞానపత్రం అందజేశారు.. ఇక, ఇవాళ్టి సమావేశంలోనూ గత సమావేశంలో చర్చించిన అంశాలే మరలా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.. గోదావరి…
ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ఢిల్లీ హైకోర్టు సీజేతో మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలకు భంగం కలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ పోలీసులు, లాయర్లు కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. కోర్టుల భద్రత అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని, ఈ కాల్పుల ఘటనతో భద్రత మళ్లీ చర్చనీయాంశమైందన్నారు. కోర్టుల భద్రత అంశంపై వచ్చేవారం చర్చిస్తామని చెప్పారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.శుక్రవారం ఢిల్లీ…
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినబాట పట్టారు.. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు.. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, రేపు రాజధానికి చేరుకోనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎల్లుండి కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని సమస్యలు చాలా ఉన్నాయి.. కృష్ణా నది జలాల విషయం జల జగడం రోజు రోజుకీ రెండు రాష్ట్రాల…
ఢిల్లీ రోహిణి కోర్టు హల్ లో జరిగిన “గ్యాంగ్ వార్” లో మొత్తం నలుగురు మరణించారు. “మోస్ట్ వాంటెడ్” గ్యాంగ్ స్టర్ జితేంద్ర, అలియాస్ గోగి పై టిల్లు గ్యాంగ్ మనుషులు కాల్పులు జరపగా గోగి అక్కడికక్కడే మృతి చెందాడు. గోగి పై దాడి కి పాల్పడిన టిల్లు గ్యాంగ్ కు చెందిన దుండగులపై ఢిల్లీ “స్పెషల్ సెల్” సాయుధ పోలీసులు కాల్పులు జరిపడంతో వారిలో ముగ్గురు మరణించారు. ఈరోజు మధ్యాహ్నం 2.34 గంటలకు కోర్టు నెంబర్…
అమరావతి : దేశ రాజధాని ఢిల్లీకి సీఎం జగన్ మరోసారి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఢిల్లీకి వెళ్ళనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎల్లుండి వామపక్ష తీవ్రవాదం పై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో సమావేశం జరుగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న ఈ సమావేశం జరుగనుంది. ఇక ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యం లోనే రేపు ఢిల్లీ వెళ్లనున్నారు…
ఇటీవలే ఢిల్లీలో పర్యటించి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్… రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. తర్వాత జరిగే BAC సమావేశంలో అసెంబ్లీ సెషన్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేస్తారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ముఖ్యమంత్రి. రేపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఆదివారం రోజు నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల ఆరంభంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. హస్తినలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తదితరులను కలిశారు.. ఓవైపు రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూనే.. మరోవైపు.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి…