పాతతరం విమానాలను వియానాయ సంస్థలు వేలం వేసి తుక్కుకింద అమ్మేస్తుంటాయి. ఇలానే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఓ విమానాన్ని ఇటీవలే తుక్కుకింద విక్రయించారు. అలా విక్రయించిన విమానాన్ని ఢిల్లీలోని రహదారి గుండా తరలిస్తుండగా వంతెన కింద ఇరుక్కుపోయింది. వంతెన కింద ఇరుక్కుపోవడంతో ఆ దృశ్యాలను కొంతమంది వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని సేవల నుంచి ఎయిర్ ఇండియా తొలగించిందని, తుక్కుకింద కొనుక్కున్న వారు దానిని తరలించే క్రమంలో అలా వంతెన కింద ఇరుక్కుందని, ఎయిర్ ఇండియాకు ఆ విమానంతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.