ఢిల్లీకి విద్యుత్ సంక్షోభం పొంచి ఉంది. దేశంలో ఉన్న మొత్తం 135 బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు దేశంలో వినియోగంచే 70 శాతం విద్సుదుత్పత్తి ని చేస్తున్నాయి. వీటిలో సగానికి పైగా విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 3 రోజులలోపే బొగ్గు నిల్వలు అడుగంటే అవకాశం ఉంది. ఒక రోజుకు సరిపడా మాత్రమే ఢిల్లీ కి చెందిన విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. రెండు రోజులలో బొగ్గు సరఫరాను పునరుధ్దరించకపోతే, అంధకారంలో దేశ రాజధాని వెళ్లనుంది. సుదీర్ఘ సమయం “పవర్ కట్” లు విధించే తమిళనాడు, ఒడిస్సా లాంటి పలు రాష్ట్రాలతో పాటు, ఢిల్లీ కూడా జత చేరనుంది. తక్షణమే బొగ్గు సరఫరా, గ్యాస్ సరఫరా ను అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేసారు.
బహిరంగ మార్కెట్లో యూనిట్ ధర 20 రూపాయలకు పెంచారు, దీన్ని నియంత్రించాలని విజ్ఞప్తి చేసారు. విద్యుత్తు సంక్షోభాన్ని అధిగమించేందుకు ఉన్న అవకాశాలను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సంక్షోభాన్ని అధిగమించేందుకు సాధ్యమైనంత మేర పని చేస్తున్నామన్న కేజ్రీవాల్… తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాసారు.