ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో “బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో-2022″ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ ఎక్స్పో రెండు రోజుల పాటు జరుగనుంది. ఈ బయోటెక్ స్టార్టప్ ఎక్స్పోను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ)లు నిర్వహిస్తున్నాయి. బీఐఆర్ఏసీ ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. దేశంలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, బయో-ఇంక్యుబేటర్లు, తయారీదారులు, రెగ్యులేటర్లు, ప్రభుత్వ అధికారులు…
హోం వర్క్ చేయలేదని ఐదేళ్ల బాలికపై తల్లి కర్కషంగా వ్యవహరించారు. కాళ్లు, చేతులు కట్టేసి ఎర్రని ఎండకు డాబాపై పడుకోబెట్టింది. పైన ఎండ, కింద డాబా వేడికి చిన్నారి విలవిల్లాడింది. అయినా ఆ తల్లి మనసు కరగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని తుఖ్ మీర్ పూర్ ప్రాంతంలోని కర్వాల్ నగర్ లో చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న బాలిక హోం వర్క్ చేయనుందకు 5-7…
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గతనెల 30న మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఇవాళ (సోమవారం) తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. కోల్ కత్తాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్,…
ఐకానిక్ ఇండియా అందాల పోటీ 2022 టైటిల్ విజేతగా నట్టి కరుణ నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన ఈ అందాల పోటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు అందాల భామలు పాల్గొన్నారు. ఈ పోటీలో ఈ ఏడాది విన్నర్ గా నట్టి కరుణ పోటీపడి, విజయం సాధించారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కుమార్తె అయిన నట్టి కరుణ తమ సొంత బ్యానర్ లో నిర్మాతగా కొన్ని…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి. దావోస్ పర్యటన ఓ గండికోట రహస్యమంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మేలు చేయాలంటే వెళ్లాల్సింది దావోస్ కి కాదని, ఢిల్లీకి అని ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే దావోసే ఏపీకి పరిగెత్తుకు వస్తుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ కారిడార్, విశాఖ ఉక్కును కాపాడటం…
దేశ రాజధానిని వడగళ్ల వాన కుదిపేసింది. భారీ గాలి, వడగళ్లతో దేశ రాజధానిని అతలాకుతలం చేసింది. భారీ గాలులులతో చెట్లు కూలిపోయాయి. భారీ వర్షానికి నగర జీవనం ఒక్కసారిగా స్తంభించింది. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. గాలి వాన భీభత్సానికి పలువురు మరణించారు. చాలా చోట్ల చెట్లు కూలిపోవడం వల్ల వాహనాలు దెబ్బతిన్నాయి. 2018 తర్వాత వచ్చిన చాలా ప్రభావంతో వచ్చిన వర్షంగా వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపుగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో…
కరోనా కల్లోలమో, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమో, రెండూ కలిసి దరువేశాయోగానీ, ధరల మోత సామాన్యుల బతుకులను బండకేసి బాదింది, బాదుతోంది. ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో పైపైకి ఎగబాకుతోంది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదంటూ కామన్ మ్యాన్ కష్టాల రాగం ఆలపిస్తున్నాడు. ఇలా రేట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టైంలో, కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ రిలీఫ్ ఇచ్చింది. పేస్ట్ నుంచి పడుకునే బెడ్ వరకు అన్ని ధరలు ప్రభావితమయ్యే పెట్రో రేట్లను కూసింతో, కాసింతో తగ్గించింది. లీటర్…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తీరుపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. స్నేహపూర్వకంగా వుండే రాష్ట్ర ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాలను అస్సలు పట్టించుకోరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రైతుల కోసం ఏం చేసినా కేంద్రానికి నచ్చదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ‘రైతు పోరాటానికి మా మద్దతు ఉంటుంది. తెలంగాణ ఏర్పడక ముందు కరెంట్ కోతలు తీవ్రంగా ఉండేవి. రోజుకు 10మంది రైతులు చనిపోయేవారు. వ్యవసాయంపై ఇప్పటికీ కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. మోటార్లకు మీటర్లు పెట్టాలని…
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా వున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేజ్రీవాల్ నివాసంలో కేసీఆర్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు కేసీఆర్, కేజ్రీవాల్ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం చండీగఢ్ బయలు దేరారు సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్. కేసీఆర్ కారులోనే బయలు దేరారు కేజ్రీవాల్. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చండీగఢ్కు పయనమయ్యారు. గాల్వన్ వ్యాలీ అమరవీరుల జవానులకు నివాళులు అర్పించారు కేజ్రీవాల్, కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. అనంతరం రైతు ఉద్యమంలో చనిపోయిన 600 రైతు…