హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆమె.. ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, తనకు ఎదురైన అనుభవాలు, కేసీఆర్ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలు.. తదితర అంశాలపై చర్చించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. నేను ఎవ్వరిని కించపరచటం లేదు.. కానీ, నన్ను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమిత్ షాతో అన్ని అంశాలపై చర్చించాను..…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హస్తిన టూర్ పొలిటికల్ హీట్ పెంచుతోంది… కొంత కాలంగా తెలంగాణ సర్కారుకు గవర్నర్ మధ్య కొనసాగుతున్న గ్యాప్ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత ఢిల్లీలో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యాసంగి ధాన్యం కేంద్రం కొనాల్సిందేనంటూ.. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్.. అటు ఢిల్లీలోనూ దీక్షకు సిద్ధమవుంది. సీఎం కేసీఆర్ ధర్నాలో పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో ఇటు తెలంగాణ బీజేపీ…
పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి… ఓ దశలో రాజీనామాకు సిద్ధపడ్డారు.. సోనియా, రాహుల్ గాంధీకి లేఖ రాసి.. ఇక, నేను కాంగ్రెస్ గుంపులో లేనట్టే అని పేర్కొన్నారు.. ఎంతమంది సముదాయించినా వెనుకడుగు వేసినట్టు కనిపించలేదు.. కానీ, రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం తర్వాత మనసు మార్చుకుని రాజీనామా లేఖను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇవాళ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసిన ఆయన.. ఇకపై…
ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో దేశ రాజధాని పొలిటికల్ లీడర్లతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా యువ ఎంపీల కూతుళ్లను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. తాజాగా టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు కుమార్తెకు ప్రధాని మోదీ చాక్లెట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. కాగా అంతకుముందు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కుమార్తెకు…
డ్రగ్స్ దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరయిన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర సంస్థలకు లేఖ రాసాను గతంలోనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్పెషల్ విచారం టీం ఏర్పాటు చెయ్యాలని. హైకోర్టు కు పోయింది నేను. డ్రగ్స్ ను అడ్డం పెట్టుకుని, సినిమా వాళ్లపై టీఆర్ఎస్ వాళ్ళు పట్టు సాధించారు. నేను మళ్ళీ కోర్టుకి వెళ్తాను. దాడి చేసిన పబ్బుకు 24 గంటల సరఫరాకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సూదిని ప్రణయ్ రెడ్డి విషయంలో…
తెలంగాణలో గత కొంత కాలంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అధికారపక్షానికి, గవర్నర్‌కు క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది.. కొన్ని సార్లు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై కామెంట్లు కూడా చేశారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఈ మధ్య రాజ్‌భవన్ వేదికగా నిర్వహించిన ఉగాది వేడుకల్లోనూ.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఉగాది ఉత్సవాలకు ఆహ్వానించినా వారు ఎవరు రాలేదని గవర్నర్ తమిళిసై అసంత్రృప్తి వ్యక్తం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు.. రేపు ఢిల్లీకి వెళ్లనున్నా ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం భేటీ కానున్నట్టుగా చెబుతున్నారు.. కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్రానికి నిధుల విషయంపై చర్చిస్తారని సమాచారం.. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.. ప్రధాని మోడీతో సమావేశం…
రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీని అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం అధికారమే లక్ష్యంగా 2023 ఎన్నికలకు క్యాడర్ ని సమాయత్తం చేయాలని భావిస్తోంది. ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. రాహుల్ తో సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటూ ఇతర…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర కేబినెట్… ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశాలో… ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది.. మంత్రివర్గ ఆమోదంతో 31 శాతంగా ఉన్న డీఏ 34 శాతానికి పెరగనుంది.. పెరుగుతున్న ఇంధన ధరలు మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఉపశమనం కలిగిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా డీఏ పెంపు నిలిచిపోయింది.. ఉద్యోగుల జీతాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని…
విమానం ఓ కరెంట్ పోల్ ఢీకొన్న గటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో.. ప్రయాణికులతో ఎస్జీ160 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సి ఉంది.. ప్రయాణికుల విమానం ఎక్కిన తర్వాత.. పుష్ బ్యాక్ చేస్తున్న సమయంలో విమానం కుడి వైపు రెక్క విద్యుత్ పోల్‌ను తాకింది.. స్పైస్‌జెట్ సంస్థకు చెందిన ఆ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ పోల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ప్రయాణికులను…