కరోనా మహమ్మారి భయం ఇంకా వీడడం లేదు.. రోజుకో రూపం మార్చుకుంటూ టెన్షన్ పెడుతోంది కరోనా వైరస్. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల థర్డ్ వేవ్ వచ్చింది. దేశంలో కొత్తగా రెండు ఎక్స్ఈ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. జులై నాటికి ఎక్స్ఈ వేరియంట్ ద్వారా ఫోర్త్ వేవ్ వస్తుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. కాగా, ఎక్స్ఈ వేరియంట్ బారిన పడ్డ వాళ్లలో ఎక్కువ మందికి గొంతు నొప్పి, ముక్కు కారటం, దగ్గు, తలనొప్పి, అలసట వంటి…
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేట్ 2 శాతం దాటగా… వారం రోజుల్లోనే హోం ఐసోలేషన్ కేసులు దాదాపు 48శాతం పెరిగాయి. ముఖ్యంగా స్కూళ్లలో ఎక్కువ కేసులు బయటపడుతుండటం గవర్నమెంట్ అప్రమత్తమైంది. ఢిల్లీలో వరుసగా కేసులు పెరుగుతున్నాయి. గురువారం 325 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1న 0.57శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు గురువారానికి 2.39 శాతానికి చేరింది. శుక్రవారం నాడు 366 కొత్త కేసులు నమోదు కాగా……
మనదేశ రాజకీయాల్లో ప్రధానమంత్రులది కీలక స్థానం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రుల మ్యూజియం ప్రారంభమయింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్కు ప్రధాన మంత్రులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించేలా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ప్రతి యుగంలో, ప్రతి తరంలో ప్రజాస్వామ్యాన్ని మరింత సాధికారికంగా, ఆధునికంగా మార్చడానికి నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. మారుమూల పల్లె నుంచి, పేదరికం నుంచి, రైతు కుటుంబం నుంచి ప్రధాని పదవిని…
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ దీక్షలో జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? నరేంద్ర మోదీ ఎవరితోనైనా పెట్టుకో.. కానీ రైతులతో మాత్రం పెట్టుకోవద్దు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా…
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం దేశ రాజధాని ఢిల్లీలో పోరాటం చేయాల్సి రావడం కేంద్రానికి సిగ్గు చేటు అంటూ ఫైర్ అయ్యారు రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్… వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ సర్కార్.. హస్తిన వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించింది.. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టారు.. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని.. వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు..…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ సర్కార్.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనలు చేస్తోంది.. ఇప్పటికే వివిధ రూపాల్లో గ్రామస్థాయి నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆ పార్టీ ఇప్పుడు.. హస్తిన వేదికగా ఢిల్లీపై యుద్ధం ప్రకటించింది.. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టారు.. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని.. వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఈ దీక్షలో పాల్గొన్న…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో.. వివిధ రూపాల్లో ఆందోళన చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు హస్తిన వేదికగా ఆందోళనకు సిద్ధం అయ్యింది.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ వేదికగా నిరసన దీక్ష చేపట్టబోతున్నారు.. కేంద్రం ధాన్యం కొనాలంటూ ఢిల్లీలో నిరసన దీక్షకు దిగుతోంది టీఆర్ఎస్ పార్టీ… ధాన్యం సేకరణ కోసం దేశ వ్యాప్తంగా…
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కోట్ల విలువైన నగలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఫిబ్రవరి 23 న ఈ ఘటన జరగగా హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సోనమ్ ఇంట్లో పనిచేసేవారి ద్వారా ఈ విషయం బయటపడినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఒక ఖరీదైన ప్లాట్ లో సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా, అతని తల్లితండ్రులుతో…
తెలంగాణలో యాసంగిలో పండిన వరి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ ఆందోళనలు ఉధృతం చేసింది. ఇప్పటికే మండల కేంద్రాల్లో ధర్నాలు… జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాలను పూర్తి చేసిన టీఆర్ఎస్… గురువారం జిల్లా కేంద్రాలు… కలెక్టరేట్ల వద్ద నిరసన దీక్షలు చేపట్టింది. వరుస ఆందోళనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. శుక్రవారం నల్ల జెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించాయి టీఆర్ఎస్ శ్రేణులు. ధాన్యం కొనుగోలు విషయంలో…