Delhi : ఫ్రెండ్ అని నమ్మిపోతే.. మత్తుమందు కలిపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : స్నేహం ముసుగులో కాలనాగులా కాటేస్తున్నారు కీచకులు. వారి చర్యలకు అమాయకపు మహిళలు బలవుతున్నారు. టైం కోసం చూస్తున్నారు.. అదును చూసి కాటేస్తున్నారు కాలనాగులు. ఈ కోవకు చెందినవే తాజా ఘటనలు.. పంజాబ్‌లోని లుధియానాలో చోటు చేసుకున్న ఈ ఘటన తినే పదార్థాల్లో మత్తుమందు కలిపి.. అమ్మాయి అపస్మారకస్థితిలోకి జారుకోగానే తాను అనుకున్న పని చేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది రోజుల పాటు ఆమెను నిర్బంధించి లైంగిక దాడి చేశాడు. చివరకు స్పృహలోకి వచ్చిన యువతి.. ఎలాగోలా ఆ కీచకుడి చెర నుంచి బయటపడింది.
Read Also: Crime News: ట్యూషన్ కోసమని వెళ్లిన పదేళ్ల బాలిక నీటి సంపులో మృతదేహమై..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
లుధియానాలోని హతుర్‌కు చెందిన జస్పాల్ సింగ్, బాధిత యువతి ఇద్దరూ స్నేహితులు. అయితే, తన దుబాయ్ ట్రిప్ కోసం షాపింగ్ చేయడానికి సహాయం కావాలని, సెప్టెంబర్ 30న రాయికోట్‌కు రావాలని యువతిని కోరాడు. దాంతో స్నేహితుడే కదా అని నమ్మిన యువతి అతని కోసం రాయికోట్‌కు వెళ్లింది. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం.. మత్తు మందు ఇచ్చిన ఆహారాన్ని ఆమెతో తినిపించాడు. దాంతో యువతి అపస్మారకస్థితికి చేరుంది. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి యువతిని ఉత్తరప్రదేశ్‌లోని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నాటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు. అక్టోబర్ 8న యువతి స్పృహలోకి రాగా, ఆ కీచకుడి చెర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలోనూ అతను యువతిపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. మొత్తానికి అతని చెర నుంచి తప్పించుకుని స్వగ్రామానికి వచ్చిన యువతి.. కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు, చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. జస్పాల్ సింగ్‌పై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 342, 376 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Read Also: NASA: దారి మళ్లిన గ్రహశకలం.. నాసా డార్ట్ ప్రయోగం సక్సెస్
అలాగే.. స్నేహితుడనుకుని నమ్మి, అతడుంటున్న హోటల్ గదిని వెళ్లిన యువతిపై ఆ స్నేహితుడు, మరో ఇద్దరితో కలిసి సామూహిక అత్యాచారం చేశారు.
32 ఏళ్ల బాధిత యువతి, పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతికి అజయ్ అనే స్నేహితుడున్నాడు. అతడి ఆహ్వానం మేరకు ఆ యువతి అజయ్ ఉంటున్న హోటల్ గదికి వెళ్లింది. అక్కడ అజయ్ తో పాటు అతడి ఇద్దరు స్నేహితులున్నారు. అజయ్ ఆ యువతికి కూల్ డ్రింక్ ఆఫర్ చేశాడు. అయితే, ఆ యువతికి ఇచ్చిన డ్రింక్ లో వారు మత్తు మందు కలిపారు. దాంతో, ఆ యువతి అపస్మారక స్థితికి వెళ్లింది. అనంతరం ఆ ముగ్గురు ఆ యువతిని గ్యాంగ్ రేప్ చేశారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఢిల్లీ లోని ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అనంతరం, నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు అజయ్, తారాచంద్, నరేశ్ లు రాజస్తాన్ లోని అల్వార్ కు చెందినవారని పోలీసులు వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 376, 377, 328 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!