IND Vs SA: ఢిల్లీ వన్డే మనదే.. వన్డే సిరీస్ కూడా మనదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs SA: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి రనౌట్‌గా వెనుతిరగ్గా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 49 పరుగులకు అవుటయ్యాడు. గత మ్యాచ్ హీరో ఇషాన్ కిషన్ 10 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్), సంజు శాంసన్ (2 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. మూడో వన్డేలో సులభంగా గెలవడంతో పాటు మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ధావన్ సేన కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫార్చ్యూన్, లుంగి ఎంగిడి తలో వికెట్ సాధించారు.
Read Also: Nandamuri Balakrishna: బ్రేకింగ్ న్యూస్.. బాలకృష్ణకు రెండో ఫ్యామిలీ.. చంద్రబాబు ముందే బట్టబయలు
Also Read
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
కాగా అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 27.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియాపై లోయెస్ట్ స్కోర్ నమోదు చేసి చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే దక్షిణాఫ్రికా జట్టుకు ఇది నాలుగో అత్యల్ప స్కోర్. 34 పరుగులు చేసిన క్లాసెన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కుల్‌దీప్ యాదవ్(4/18) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. 4.1 ఓవర్లు మాత్రమే వేసిన కుల్‌దీప్ ఓ ఓవర్ మెయిడిన్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. తన ప్రదర్శనతో పాత కుల్‌దీప్ యాదవ్‌ను తలపించాడు. అటు మహమ్మద్ సిరాజ్(2/17), వాషింగ్టన్ సుందర్(2/15), షాబాజ్ అహ్మద్ (2/7) సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!