సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి వారు.. వారి ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. కొందరు తమలో ఉన్న ప్రత్యేకతను బయటపెడుతూ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.. వ్యూస్, లైక్‌లు, కామెంట్ల కోసం పరితపిస్తున్నారు.. మరికొందరు వెకలి చేష్టలకు కూడా వెనుకాడడం లేదు.. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వినూత్నంగా ఓ వీడియో తీశాడు. దీంతో, ఈ వీడియోసోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూనే.. ఆ వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు..
వైరల్‌గా మారిన ఆ వీడియో విషయానికి వస్తే.. ఢిల్లీకి చెందిన మోహిత్ గౌహర్‌కు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, వినూత్నంగా ట్రయ్ చేస్తూ వీడియోలను తన అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటాడు. అలాగే, తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. వీడియో సందర్బంగా మోహిత్.. ఢిల్లీ మెట్రోలో హంగామా చేశాడు. మెట్రో రైలు కోచ్‌లో బనియన్, టవాల్‌తో దర్శనమిచ్చాడు. అంతటితో ఆగకుండా ఏదో ఫ్యాషన్ షోలో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ.. ఊపుతూ క్యాట్ వాక్ చేస్తూ రచ్చ చేశాడు.. ఇక, రైలులోని అద్దాల్లోతన అందం చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు. అయితే, రైలులో మనోడి వేషాలు చూసినవారు నవ్విపోయారు.. తెగ ఎంజాయ్ చేశారు.. కొందరు మాత్రం ఏంటిరా? ఇది అని మండిపడ్డారు.. ఈ ఇంట్లో చేసుకో.. ఓ పబ్లిక్ ప్లేస్‌లో ఇదేంపని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తంగా ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది..