Human Sacrifice: తూర్పు ఢిల్లీలో అదృశ్యమైన మూడేళ బాలుడి మృతదేహాన్ని మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలుడిని నవంబర్ 30న ప్రీత్ విహార్‌లోని అతని నివాసం నుండి కిడ్నాప్ చేసి.. యూపీలో హత్య చేశారు. మీరట్‌లోని ఒక పొలంలో బాధితుడి తల లేని మొండెం స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేయబడిన నిందితుడు (16) నరబలిలో భాగంగానే బాలుడిని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
జగత్‌పురిలో నివాసం ఉంటున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీనియర్ పోలీసు అధికారి అమృత గుగులోత్ వెల్లడించారు. విచారణలో నిందితుడు మీరట్‌లోని చెరకు తోటలో పిల్లవాడిని విడిచిపెట్టినట్లు చెప్పడు. అనంతరం పోలీసు బృందం అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టగా.. తలతో పాటు కొన్ని అవయవాలు లేని చిన్నారి మృతదేహం దొరికిందని ఆ పోలీసు అధికారి చెప్పారు. తల మృతదేహానికి సమీపంలో దొరికిందని.. ఆ చిన్నారి బట్టల ఆధారంగా ఆ బాడీ తప్పిపోయిన చిన్నారిదని గుర్తించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆమె వెల్లడించారు.
Wedding: పెళ్లి పీటలపై ఆగలేకపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు
చిన్నారి దారుణ హత్య వార్త తెలియగానే, అతని కుటుంబ సభ్యులు, ఇతర స్థానికులు నిరసనలు చేపట్టారు. ప్రీత్ విహార్ ప్రాంతంలో రహదారిని దిగ్బంధించారు. ఆగ్రహించిన ఆందోళనకారులు గుంపును చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు.