CM Chandrababu: నేను చాలా అదృష్టవంతుడిని.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి పనిచేసే అవకాశం లభించింది అని గుర్తుచేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. పీఎం మ్యూజియంలో జరిగే “ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు” అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ క్రమంలో 6వ సంస్మరణ ప్రసంగం చేశారు.. పీవీ భారత ముద్ద బిడ్డ, భారత రత్న.. అసలుసిసలు తెలుగు బిడ్డ అని కీర్తించారు.. ఆయనతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవని గుర్తుచేసుకున్నారు.. 17 భాషల్లో పీవీ నిష్ణాతుడు.. కానీ, ప్రస్తుతం హిందీ భాష నేర్చుకోవడం పై పెద్ద రాద్దాంతం చేస్తున్నాం అని విమర్శించారు.
Read Also: SSMB 29 : మహేశ్ మూవీ కోసం అంతా కొత్తవాళ్లే.. జక్కన్న ప్లాన్ ఏంటి..?
ఎంతో సంయమనం, ఆలోచనపరమైన దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు పీవీ అంటూ కొనియాడారు చంద్రబాబు.. గతంలో భారత ఆర్ధికాభివృద్ది రేటు 3 నుంచి 5 శాతం ఉండేది.. గతంలో భారత దేశానికి చెందిన బంగారాన్ని తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఉన్నాం.. పిల్లి రంగు నలుపా, తెలుపా అనే వ్యత్యాసంతో చూడరాదు.. ఎలుకను పట్టుకునే పిల్లి అయితే చాలు అన్నారు చంద్రబాబు.. సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. సరిగ్గా అదే చేశారు పీవీ నరసింహారావు అని తెలిపారు.. 1991లో దివంగత పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణల ఫలాలను ఇప్పుడు దేశ ప్రజలంతా అనుభవిస్తున్నారు.. అన్ని పార్టీల మధ్య రాజకీయ ఏకాభిప్రాయం సాధించడంలో అసాధారణ ప్రతిభాశాలి పీవీ అంటూ ప్రశంసలు కురిపించారు చంద్రబాబు.
Read Also: Sant Tukaram Movie: తెలుగు హీరో డైరెక్టర్ గా ‘సంత్ తుకారాం’ జూలై 18న విడుదల
2014లో ప్రపంచంలో 11వ ఆర్ధిక శక్తిగా భారత్ ఉంది.. 2028 కల్లా భారత్ మూడవ ఆర్ధిక శక్తిగా ఆవిర్భవిస్తామన్న విశ్వాసం నాకు ఉందన్నారు చంద్రబాబు.. 2047 కల్లా భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్ధిక శక్తిగా ఆవిర్భవిస్తామనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు.. 1991లో పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడం ప్రారంభించారు.. అప్పట్లో 3 నుంచి 4 వరకు భారత్ ఆర్థికాభివృద్ధి రేటు ఉండేది.. ప్రస్తుతం భారత్ ఆర్థికాభివృద్ధి రేటు 6 నుంచి 7 వరకు ఉంది. 2047 కల్లా భారత్ వృద్ధి రేటు 10కి మించి ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..