ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. ఈ భేటీపై లంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ ఒకటే ఎజెండాగా పెడితే చర్చలకు రాలేమని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పామన్నారు. అలాగే, ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ అక్రమంగా తరలించుకుపోయారని ఆరోపించారు. ఇక, భవిష్యత్ లో గోదావరి నదిపై నాసిక్ లో ప్రాజెక్టులో కడితే ఎండిపోతుంది.. అప్పుడు తెలంగాణ పరిస్థితి ఏం కావాలన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే వింత అన్నారు.. కూలిపోతే ప్రపంచంలోనే వింత అవుతుంది.. మేడిగడ్డ మొత్తం కూలిపోతుందని ఎన్డీఎస్ఏ ఇప్పటికే రిపోర్టు కూడా ఇచ్చందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
Read Also: Telugu CMs Meeting: ఢిల్లీకి చేరిన నీళ్ల పంచాయతీ.. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..!
మరోవైపు, ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగింది.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్ పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సైతం చర్చలు జరిపి పనుల్లో వేగం పెంచామన్నారు. కేంద్రాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ను సైతం మార్చి కొత్తవారికి పనులు అప్పగించాం.. ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పనులు చేస్తు్న్నాం.. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.