దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి కేంద్ర వాతావరణ శాఖ దుమ్ము తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ సంభవించొచ్చని సూచించింది. గురు, శుక్రవారాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. టీడీపీ మహానాడు బహిరంగ సభ తర్వాత కడప నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తాజ్ హోటల్లో జరిగే సీఐఐ ఏజీఎం సమావేశంలో సీఎం పాల్గొంటారు. రేపు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య ఈ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను బాబు కలిసే అవకాశముంది. యోగా దినోత్సవంకు…
భారతదేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. మళ్లీ చాపకింద నీరులా పాకుతోంది. కోవిడ్ పూర్తిగా అంతరించిపోయిందన్న భావనలో ఉన్న ప్రజలకు మళ్లీ షాకిస్తోంది. కొత్త వేరియంట్రూపంలో ప్రజలకు దడ పుట్టిస్తోంది.
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా యాక్టివ్ కేసులు 1000 దాటాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసి గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ ప్రకారం, కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 209, ఢిల్లీ 104 యాక్టివ్ కేసులతో మూడవ స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య…
Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షం దెబ్బకు పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే, ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
దేశ రాజధాని ఢిల్లీకి కేంద్ర వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. ముందస్తు రుతుపవనాల రాక కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
భారత్‌లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేరళ, ముంబై, ఢిల్లీలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి.
ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కానుంది. ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
విభజన చట్టంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టారు.. పదేళ్లయిపోయింది కాబట్టి ఇప్పుడు రాజధానిగా లేదు.. గతంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించారు.. ఇప్పుడు చట్ట సవరణ చేసి అమరావతిని నోటిఫై చేయాలని కోరామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్ సహా మరికొందరితో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు.. వరుసగా కేంద్రమంత్రులతో సమావేశం అవుతూ వస్తున్నారు.. ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.. అమిత్‌షాతో విడిగా కూడా ప్రత్యేక చర్చలు జరిపారు ఏపీ ముఖ్యమంత్రి.. గంటన్నర పాటు అమిత్ షా - చంద్రబాబు సమావేశం సాగింది..