US: నేరాలకు పాల్పడితే కఠిన ఆంక్షలు.. విదేశీయులకు అమెరికా ఎంబసీ వార్నింగ్
- నేరాలకు పాల్పడితే కఠిన ఆంక్షలు
- విదేశీయులకు అమెరికా ఎంబసీ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సంతతికి చెందిన ఒక మహిళ అమెరికా స్టోర్‌లో దొంగతనానికి పాల్పడింది. ఏడు గంటల పాటు స్టోర్‌లో తిరిగి రూ.లక్షకు పైగా వస్తువులను దొంగింలించింది. డబ్బులు చెల్లించకుండా బయటకు వెళ్లిపోతుండగా పట్టుబడింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎంబసీ.. విదేశీయులకు వార్నింగ్ ఇచ్చింది. యూఎస్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో నేరాలకు పాల్పడేవారు అమెరికాకు రాకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని హెచ్చరించింది. అగ్ర రాజ్యంలో భారతీయ మహిళ దొంగతనం చేస్తూ దొరికిపోయిన నేపథ్యంలో అమెరికా ఎంబసీ ఈ హెచ్చరిక జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం! ఏం తేల్చిందంటే..!
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
భారతీయ పౌరురాలు ఇల్లినాయిస్ టూరిస్ట్ వీసాపై అమెరికాకు వెళ్లింది. అక్కడ టార్గె్ట్ రిటైల్ స్టోర్‌కు వెళ్లింది. మా అయితే స్టోర్‌లో ఒక గంట.. రెండు గంటల్లో పని పూర్తవుతుంది. కానీ ఇల్లినాయిస్ ఏకంగా ఏడు గంటల పాటు స్టోరీలోనే ఉంది. ట్రాలీలో రూ.లక్షకు పైగా వస్తువులను వేసుకుని బయటకు జారుకుంటోంది. సిబ్బంది గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె దానికి బిల్లు చెల్లించింది. అయితే దొంగతనంపై స్టోర్ యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పోలీసులు కూడా అరెస్ట్‌పై అధికారికంగా ఏం వెల్లడించలేదు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో ఘోరం.. గుండెపోటుతో 4వ తరగతి విద్యార్థి మృతి
ఈ నేపథ్యంలోనే నేరాలకు పాల్పడితే న్యాయపరమైన సమస్యలే కాదు.. దానివల్ల మీ వీసా రద్దయ్యే ప్రమాదం ఉందని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. భవిష్యత్తులో అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతారని వార్నింగ్ ఇచ్చింది. శాంతిభద్రతలకు అమెరికా అత్యంత విలువనిస్తుందని… విదేశీయులు కూడా అమెరికా చట్టాలను తప్పనిసరిగా పాటించాలని ఎంబసీ కోరింది.
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?