Telugu CMs Meeting: ఢిల్లీకి చేరిన నీళ్ల పంచాయతీ.. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..!
- కాసేపట్లో ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం..
- కృష్ణా, గోదావరి బేసిన్లలో పెండింగ్‌లోని అన్ని అంశాలపై చర్చ..
- గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ అంశాన్ని పక్కన పెట్టాలని తెలంగాణ వెల్లడి..
- గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉంది: చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu CMs Meeting: ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశ ఎజెండాలో గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ అంశం పక్కన పెట్టాలని నిన్న ( జూలై 15న) జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ సీఎస్ లేఖ రాశారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను చర్చించి పరిష్కరించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో లేఖ రాశారు.
Read Also: YS Jagan: బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువ ఉంటాయి.. సెన్సార్ వాళ్లకు చెప్పండి!
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
అయితే, నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు నీరు అందించడం కోసమే పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం అని పేర్కొన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవడానికి బనకచర్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి కర్నూలు జిల్లాలోని బనకచర్ల రెగ్యులేటర్ వరకూ 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు వివరించారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 టీఎంసీల మిగులు నీరు ఉంటుందన్నారు. చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాళ జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!