Chandrababu and Amit Shah: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు.. కాసేపటికే క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం ముగిసింది.. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.. మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రి అమిత్ షాకు, కేంద్రానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు.. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు, ఆభివృద్ది కార్యక్రమాలకు ఆర్ధిక సాయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమాలోచనలు చేశారు.. ఏడాది కాలంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం..
Read Also: Kota Srinivas : కోట శ్రీనివాస్ నుంచి నటన నేర్చుకున్నా.. జెనీలియా ఎమోషనల్..
రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థను కేంద్రం అందించిన సహకారంతో గాడిలో పెడుతున్నామన్నారు సీఎం చంద్రబాబు.. ఇప్పటికీ ఆర్ధిక వనరుల పరంగా తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమనే విషయమై సీఎం ప్రత్యేక ప్రస్తావన చేశారు.. విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్ధిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలా చూడాల్సిందిగా 16 ఆర్ధిక సంఘానికి నివేదించినట్లు అమిత్ షాకు వివరించారు చంద్రబాబు.. రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు (BPLP)పై చంద్రబాబు ప్రస్తావించారట.. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకూ 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు వివరించారు.. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజుల మిగులు నీరు ఉందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.. చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..