CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు (జూలై 15న) ఉదయం 9.45 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.45 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక, మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు. అలాగే, మధ్యాహ్నం 2.30కు సీఎం నివాసం 1-జన్‌పథ్‌లో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సరస్వత్‌తో భేటీ కానున్నారు. 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఏపీలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చిస్తారు.
Read Also: Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. 93 ఏళ్ల తర్వాత..!
ఇక, మధ్యాహ్నం 3.30 గంటలకు మూర్తి మార్గ్-3లో నిర్వహించనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అలాగే, రాత్రి 7 గంటలకు రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో భేటీ కానున్నారు. ఇక, రేపు (జూలై 16న) ఉదయం 10 గంటలకు కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు జలశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి బనకచర్ల ప్రాజెక్టుపై జరిగే సమావేశంలో భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అవుతారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేసి గురువారం నాడు ఉదయం 9.30 గంటలకు అమరావతికి తిరిగి రానున్నారు.