Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. నిన్న ఏయిర్ పొల్యూషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కాలుష్యంపై హర్యానా, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల కాల్చివేతను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే అని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. దీంతో పాటే ఢిల్లీలో యాప్ బేస్డ్ క్యాబులపై నిషేధం విధించాలని ఆప్ ప్రభుత్వానికి సూచించింది.
Delhi Pollution: ఢిల్లీ-ఎన్సీఆర్ కాలుష్యం ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతోంది. దేశ రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాలు గ్యాస్ ఛాంబర్లుగా మారాయి. గాలి నాణ్యత సూచిక చాలా పేలవమైన విభాగంలో ఉంది.
Delhi: ఢిల్లీలో ఓ స్కూల్ క్యాబ్ డ్రైవర్ అదే స్కూల్లో చదువుతున్న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఢిల్లీలోని సంసద్ మార్గ్ లోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. నవంబర్ 3న బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. ఈ విషయం గురించి పాఠశాల యాజమాన్యం నుంచి బాలిక తండ్రికి సమాచారం అందింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Delhi: ఉత్తర భారత దేశంలో పెరుగుతున్న కాలుష్యం అక్కడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో పెరిగిన కాలుష్యానికి పాఠశాలలు మూతబడ్డాయి. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ తరుణంలో పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివారాలలోకి వెళ్తే.. ప్రతి సంవత్సరం ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలలో పంట అవశేషాలను తగలబెడుతున్నారు. దీని కారణంగా ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా…
Delhi: ఢిల్లీలో కోరలు చాచిన గాలి కాలుష్యం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. గత వారం పది రోజులుగా ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం తార స్థాయికి చేరింది. దీనితో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా తీవ్ర ప్రభావితం అవుతున్నాయి. చలికాలం ప్రారంభ లోనే కాలుష్య తీవ్రత రోజు రోజుకి తార స్థాయికి చేరుకోనంటోంది. ఉత్తర భారత దేశం లోని పలు ప్రాంతాలు కాలుష్యానికి అల్లాడుతున్నాయి. కాలుష్యం పెరగడం కారణంగా అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.…
Delhi: ఢిల్లీలో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు కూడా యాక్టివ్ మోడ్లోకి వచ్చారు. పెరుగుతున్న కాలుష్యం, గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆదివారం 2200 మందికి చలాన్లు జారీ చేశారు.
ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం సిఫారసు చేసింది. ఇందులో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగస్టిన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందీప్ మెహతా పేర్లు ఉన్నాయి. వాస్తవానికి.. సుప్రీంకోర్టులో మొత్తం మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 34 కాగా, అందులో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నేపాల్లో 157 మందిని బలిగొన్న భూకంపం.. ఇప్పుడు ఢిల్లీని తాకింది. సాయంత్రం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
విషపూరిత పొగమంచుతో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత ఈరోజు కూడా తీవ్రంగా ఉంది. సోమవారం ఉదయం 9 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 437గా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకటించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
BAN vs SL Match started in Delhi: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్రంగానే ఉన్నా.. మ్యాచ్ ఆరంభం అయింది. గాలి నాణ్యత సూచిక ఇప్పటికీ ఎక్కువగానే సూచిస్తున్నా.. సూర్యుడి రాకతో గత రెండు రోజులతో పోలిస్తే వాతావరణం…