Delhi: వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తు్న్నారు. ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే భారత్‌లో పలు ప్రాంతాల్లో క్రికెట్ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాచ్‌ని ఆస్వాదించేందుకు విందు, వినోదాలను సెట్ చేసుకుంటున్నారు.
రేపు జరిగే ఫైనల్ పోరు కోసం.. ఇప్పటికే అభిమానులు అహ్మదాబాద్ కు భారీగా చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు నుంచి న్యూఢిల్లీ టూ అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలును నడుపుతోంది భారతీయ రైల్వే. ప్రస్తుతం విమాన టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటిన క్రమంలో క్రికెట్ అభిమానులకు రైల్వే తరలింపు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన జరుగుతోంది. ఈ ట్రేడ్ ఫెయిర్‌లో ఏపీ పెవిలియన్‌ను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రారంభించారు. 500 స్క్వేర్ మీటర్లలో ఏపీ పెవిలియన్‌ను ఏపీ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసింది.
Delhi Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలోని ఓ భవనంలో సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
Delhi Diwali Pollution: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో బాణసంచా కాల్చడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది.
Earthquake: ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. శనివారం ఢిల్లీలో 2.6 తీవ్రతతో మధ్యామ్నం 3.36 గంటలకు భూకంపం సంభవించింది. నార్త్ డిస్ట్రిక్ట్ లో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు.
Gambling: సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ భర్త. భార్యభర్తల బంధాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించాడు. భార్యను జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు. తన భార్యను ఏం తెలియని నగరంలో వదిలేసి వచ్చాడు. ఈ ఘటన యూపీలో అమ్రోహాలో జరిగింది. అయితే విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు ఆమెను రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు.