Delhi : తింటుంటే భుజం తగిలిందని బాలుడిని చంపిన మైనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మైనర్లు ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు.. క్షణికావేశంలో చేసే పొరపాట్లు వారిని నేరస్తులుగా మారుస్తున్నాయి.. తాజాగా ఢిల్లీ లో మరో దారుణం వెలుగు చూసింది.. 17ఏళ్ల బాలుడిని మరో మైనర్ చంపేశాడు. మోమోలు తింటుండగా మొదలైన గొడవ ఇందుకు కారణం… ఈ ఘటనతో ఢిల్లీ నగరం ఉలిక్కిపడింది.. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ ద్వారకాలోని డాబ్రి ప్రాంతంలోని రోహ్తాష్ నగర్లో ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్.. సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. అక్కడ మోమో తింటుండగా.. అతని భుజం ముఖానికి తగిలిందని వాదన పెట్టుకున్నాడు.. ఆ తర్వాత మాటా మాట పెరిగింది.. పెద్ద గొడవే జరిగింది.. కోపంతో రగిలిపోయిన బాలుడు అక్కడే ఉన్న కత్తిని తీసుకొని దారుణంగా పొడిచాడు.. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న 17ఏళ్ల మైనర్ని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గం మధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు..
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని ఆ మైనర్ దారుణంగా పొడి చంపిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కినట్టు తెలిపారు. వాటి ఆధారంగా.. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని స్పష్టం చేశారు.. అయితే ఈ ఘటన జరుగుతున్నా అక్కడ ఉన్న ఎవరు ఆపే ప్రయత్నం చెయ్యలేదు.. స్నేహితులు కానీ, స్థానికులు కానీ ఆ బాలుడిని ఆపలేదు.. అందుకే తన కొడుకు చనిపోయాడని ఆ బాలుడి తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
- Tags
- Delhi
- Latest Crime News
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?