తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత రానున్నట్లు బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
ఢిల్లీలో పండుగల సీజన్లో పరిస్థితి దారుణంగా మారింది. ఢిల్లీ ప్రజలు గాలి పీల్చుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ వాయు నాణ్యత సూచీ తాజాగా 302కి చేరింది. ఢిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ సూచీ 200 నుంచి 300 మధ్య ఉంది.
బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ నిన్న ( అక్టోబర్ 24న ) దసరా వేడుకల సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన మొదటి మహిళగా ఈ ఘనత సాధించింది.
కులతత్వం, ప్రాంతీయత వంటి సామాజిక వక్రీకరణలను రూపుమాపాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ద్వారకాలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ, కనీసం ఒక పేద కుటుంబం సామాజిక-ఆర్థిక స్థితిని పెంపొందించడంతో సహా 10 ప్రతిజ్ఞలు తీసుకోవాలని ప్రజలను కోరారు.
దసరా ఉత్సవాల్లో చివరగా రావణ దహనం చేస్తారన్న విషయం తెలిసిందే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రావణ దహనం ను సెలెబ్రేటి చేత చేయిస్తున్నారు.. ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణ్ దహన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మహిళా సెలబ్రిటీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేయనున్నారు.. ఈ ఏటా కంగనా రనౌత్ ఢిల్లీలో దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. సాధారణంగా ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణుడి దహనం కార్యక్రమాన్ని…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశ పురోగతికి బీజేపీ ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. అంతేకాకుండా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా భారత్ కూటమిని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. నేడు దేశం మూడు సమస్యలను ఎదుర్కొంటోందని కేజ్రీవాల్ అన్నారు. అందులో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి ఉన్నాయని తెలిపారు.
Swiss Woman Murder: ఢిల్లీలో ఇటీవల స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్యకు గురైంది. తిలక్ నగర్లో 30 ఏళ్ల నినా బెర్గర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గురుప్రత్ సింగ్ అనే వ్యక్తి సదరు మహిళతో రిలేషన కలిగి ఉన్నట్లు పోలీసులు వచ్చారు. స్విట్జర్లాండ్ లో ఉంటున్న మహిళను ప్లాన్ ప్రకారం ఇండియాకు వచ్చే విధంగా చేసి హత్య చేశాడు.
Operation Ajay: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసింది.. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికి హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆకస్మికంగా యుద్ధం సంభవించింది. ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్న ఇజ్రాయిల్ లో భారతీయులు చిక్కుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ లో చిక్కుకుని ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ ను నిర్వహిస్తుంది. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా కేంద్రం…
Swiss woman's murder: ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో శుక్రవారం స్విట్జర్లాండ్ మహిళ హత్యకు గురైంది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లీనా బెర్గర్(30) అనే మహిళ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం ప్రభత్వ పాఠశాల సమీ
Shocking: ఈ మధ్యకాలంలో వాహనాల్లో పాములు చొరబడటం చూస్తున్నాం. ఇటీవల హెల్మెట్ లోకి నాగుపాము దూరింది. చీకటిగా, రద్దీగా ఉండే ప్రాంతాలను కోరుకునే పాములు బైకుల సీటు కింద, కారు బానెట్ కింద దూరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటిని గమనించకుండా డ్రైవ్ చేశామో అంతే సంగతి.