సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి నేతల కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడానికి అవసరమైన ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కూటమి ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
India Alliance Meeting Today in Delhi: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి నేతల కీలక సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఇది ఇండియా కూటమి నాలుగో సమావేశం. కూటమిలోని అన్ని పార్టీల కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలపైనా కూటమి నేతలు సమీక్షించనున్నట్టు…
Man Dragged By Mini Bus in Delhi: మినీ బస్సును ఆపేందుకు ఓ యువకుడు ఏకంగా బానెట్ పైకి ఎక్కినా.. ఇదేమీ పట్టించుకోని డ్రైవరు వాహనాన్ని ఆపకుండా 4 కిమీ దూసుకెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ 3లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్తారు.. అయితే, నిన్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై నేడు హైకమాండ్ పెద్దలతో సీఎం చర్చించబోతున్నారు.
పార్లమెంట్లో గతవారం నెలకొన్న భద్రతా వైఫల్యం ఘటనపై ఇరు సభల్లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో రాజ్యసభ, లోక్‌సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఈ క్రమంలో లోక్‌సభలో ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటువేశారు.
ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. సోమవారం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌తో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నారు.
ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతర వాస్తవాలను పసిగట్టిన కాంగ్రెస్ ఇప్పుడు సీట్ల పంపకాల ప్రక్రియను వేగవంతం చేసే విషయంలో అనువైన వైఖరిని అవలంబించాలని సూచిస్తోంది. డిసెంబర్ 19న జరిగే సమావేశంలో ఇండియా కూటమి నేతల మధ్య లోక్‌సభ సీట్ల పంపకంపై విస్తృత ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది.
మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023లో హైదరాబాద్ "భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం"గా ర్యాంక్ చేయబడింది.. ఈ జాబితాలో 153వ ర్యాంక్‌తో హైదరాబాద్ టాప్ స్పాట్లో నిలవగా.. ఆ తర్వాత 154వ ర్యాంక్‌తో పుణె రెండో స్థానం, 156వ ర్యాంక్‌తో బెంగళూరు మూడో స్థానం, 161 ర్యాంక్‌తో చెన్నై నాలుగో స్థానం, 164 ర్యాంక్‌తో ముంబై ఐదో స్థానం, 170 ర్యాంక్‌తో కోల్‌కతా ఆరో స్థానం, 172 ర్యాంక్‌తో న్యూఢిల్లీ ఏడో స్థానంలో నిలిచాయి.
Komatireddy Venkat Reddy Inspected AP Bhavan in Delhi: ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై నేడు సమీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి ఏపీ భవన్ ప్రాంగణాన్ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ భవన్ విభజనలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజనలు వివాదం కూడా పెద్దగా ఏమీ లేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కొత్త భవనం కోసం మార్చి లోగా…