INDIA Alliance Meeting: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి నేతల కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడానికి అవసరమైన ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కూటమి ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అలాగే పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై నిరసన తెలిపిన 141 మంది విపక్ష ఎంపీలపై ఉభయ సభల్లో వేటు పడిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడమే కాకుండా సస్పెన్షన్‌పై భవిష్యత్ కార్యచరణను ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలోని అశోక హోటల్‌లో ఇండియా కూటమి నేతల సమావేశం జరుగుతోంది. ఈ కీలక సమావేశానికి హాజరైన సోనియా గాంధీ, లాలూ యాదవ్, టీఆర్ బాలు, ఎంకే స్టాలిన్, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై ఏఐసీసీ నేషనల్ అలయెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది.
Read Also: Mumbai : మద్యం మత్తులో కారు డ్రైవర్.. ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..
ఐదుగురితో ఏఐసీసీ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కన్వీనర్‌గా ముకుల్ వాస్నిక్‌ను నియమించారు. సభ్యులుగా . అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాష్‌లను ప్రకటించారు. ఈ కమిటీ లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్ష కూటమికి ఇది మొదిటి సమావేశం కాగా.. మొత్తానికి ఇది నాల్గవ సమావేశం.