Komatireddy Venkat Reddy Inspected AP Bhavan in Delhi: ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై నేడు సమీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి ఏపీ భవన్ ప్రాంగణాన్ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ భవన్ విభజనలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజనలు వివాదం కూడా పెద్దగా ఏమీ లేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కొత్త భవనం కోసం మార్చి లోగా…
ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ పదవికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీరు నన్ను ఎంపీగా ఎన్నుకుని నాకు పునర్జన్మ ఇచ్చారు.. ఎప్పటికీ భువనగిరి ప్రజలకు రుణపడి ఉంటాను అని వెంకట్ రెడ్డి తెలిపారు.
WhatsApp Based Bus Ticketing in Delhi: ప్రయాణీకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మరియు మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వాట్సప్ ద్వారా బస్సు టికెట్లు జారీ చేసే అంశాన్ని అధ్యయనం చేస్తోంది. దేశ రాజధానిలో ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) వాట్సప్ టికెట్ సేవలను అందిస్తోంది. దానినే బస్సు ప్రయాణికులకూ విస్తరించాలని ఢిల్లీ నగర రవాణా శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైల్…
Delhi: తనను పెళ్లి చేసుకునేందుకు నో చెప్పిందనే కోపంతో ఓ వ్యక్తి మహిళ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆమె ఫోటోలతో నకిలీ సోషల్ మీడియా ఖతాలను క్రియేట్ చేసి, అవమానకరమైన పోస్టులు పెడుతూ, కించపరిచేలా కామెంట్స్ చేస్తూ వేధించాడు. చివరకు ఈ వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Acid Attacks: దేశవ్యాప్తంగా నేరాల వివరాలను వెల్లడించే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ఇటీవల తన నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, యూటీల్లో నేరాల తీరును ఇందులో పేర్కొంది. 2022లో దేశంలో మహిళలపై ఎక్కువ యాసిడ్ దాడులు జరిగిన నగరాల్లో బెంగళూర్ నగరం మొదటి స్థానంలో ఉన్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది.
నేడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీంరావు అంబేద్కర్ 67వ వర్ధంతి.. ఈ సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పూజ్యమైన బాబా సాహెబ్ అంబేద్కర్ జీ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు.
రెండో రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న (మంగళవారం) రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఎంపీ మాణిక్కం ఠాగూర్ తో ఆయన సమావేశం అయ్యారు. అయితే, ఇవాళ ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ తో ఆయన భేటీ కానున్నారు.
మునపటి పోలిస్తే 2022 సంవత్సరంలో ఢిల్లీలో 3.3 శాతం క్రిమినల్ కేసులు పెరిగాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. గతేడాది ఢిల్లీలో దాదాపు 3 లక్షల క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2022లో దేశ రాజధానిలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద మొత్తం 2,98,988 కేసులు నమోదు కాగా.. 2021లో 2,89,045 కేసులు నమోదయ్యాయి.
డిల్లీకి చెందిన కిరణ్వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకున్నారు. ఇందుకుగాను అతను పాదయాత్ర చేస్తూ ప్రజల్లో రక్తదానం పైన ఆవాహన కల్పించే సభలను ఏర్పాటు చేసాడు.
Attack On Manipur Couple: దేశ రాజధానీ ఢిల్లీలో దారుణం జరిగింది. గుర్తు తెలియన కొందరు వ్యక్తులు మణిపూర్ దంపతులపై దాడి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సాయం కావాలంటూ కోరి.. ఆపై వారిని చితకబాదిన ఘటన సౌత్ఈస్ట్ ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే వారు ఎవరూ.. ఎందుకు దాడి చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై బాధితులు పోలిసులకు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం దర్యాప్తు…