Gurugram: హాట్ కేకుల్లా లగ్జరీ హోమ్స్.. 3 రోజుల్లోనే 868 మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు విక్రయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurugram: ఇండియాలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఢిల్లీ సమీపంలో 865 మిలియన్ డాలర్లతో చేపడుతున్న లగ్జరీ హోమ్స్ నిర్మాణం ప్రారంభం కాకముందే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ ప్రాంతంలో 1,113 విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్టులోని ఏడు టవర్లను నిర్మిస్తోంది. ఇందులో ఫోర్-బెడ్రూనం నివాసాలు, పెంట్ హౌజ్ యూనిట్లు అమ్ముడైనట్లు డెవలపర్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు. ఇందులో ఒకవంతు ఎన్ఆర్ఐలు కొనుగోలు చేశారు.
గూగుల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో సహా అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు, ఐటీ ఇండస్ట్రీకి కేంద్రంగా ఉన్న శాటిలైట్ సిటిలో 116 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్స్ విస్తరించి ఉన్నాయి. ఇత డీఎల్ఎఫ్ షేర్స్ గతేడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. 2008తో పోలిస్తే ఇదే అత్యధిక స్థాయి బెంచ్ మార్క్. BSE సెన్సెక్స్ ఇండెక్స్‌లో 18% పెరుగుదలను అధిగమించింది.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
Read Also: Flipkart: వందల మంది ఉద్యోగులపై ఫ్లిప్ కార్ట్ వేటు.. అదే అసలు కారణమా?
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పుడు కీలక స్థానంలో ఉంది. ఇందుకు తగ్గట్లుగానే ప్రజల ఆదాయస్థాయిలు పెరిగాయి. దీంతో డబ్బున్న భారతీయులు మరింత లగ్జరీగా ఉండేందుకు కార్ల నుంచి అపార్ట్మెంట్ల దాకా అన్ని ఖరీదుగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రీమియం అపార్ట్మెంట్లకు డిమాండ్ ఏర్పడిన కారణంగా రానున్న కాలంలో పలువురు బిల్డర్లు ఢిల్లీ, ముంబై, బెంగళూర్, హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ లగ్జరీ బూమ్ మరో రెండేళ్లు కొనసాగుతుందని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అండ్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు.
ధనవంతులే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఈ ప్రాజెక్టులను కొనుగోలు చేస్తున్నారు. గతేడాది డీఎల్ఎఫ్ ఇదే విధంగా కేవలం మూడు రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల విలువైన 1,100 అపార్ట్మెంట్లను విక్రయించింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కూడా ఇలాగే 500 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన విలాసవంతమైన హోమ్స్‌ని విక్రయించింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!