Delhi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే ఢిల్లీలోని ప్రదాని నివాసానికి చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎం మోదీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించన్నారు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టుల గురించి చర్చ, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇతర అంశాలపై…
కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధీనం బిల్లులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్లు కలిసి ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ఆ తర్వాత శవాన్ని ఎండు గడ్డితో కాల్చినట్లు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి ముగ్గురు టీనేజ్ నిందితులలో ఒకరిపై మృతుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగానే నిందితులు ముగ్గురు, అతడినిపై ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేశారు.
Fake Medicine : ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాసిరకం మందులు ఇస్తున్నారనే అంశం ఇప్పుడు ఊపందుకుంది. ల్యాబ్ పరీక్షలో విఫలమైన మందులను అన్ని ఆసుపత్రుల నుండి వెంటనే తొలగించాలని విజిలెన్స్ విభాగం ఆదివారం ఢిల్లీ ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించింది.
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశ ప్రధానిగా, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు అని చెప్పుకొచ్చారు.
ఇటీవల మైనర్లు ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు.. క్షణికావేశంలో చేసే పొరపాట్లు వారిని నేరస్తులుగా మారుస్తున్నాయి.. తాజాగా ఢిల్లీ లో మరో దారుణం వెలుగు చూసింది.. 17ఏళ్ల బాలుడిని మరో మైనర్ చంపేశాడు. మోమోలు తింటుండగా మొదలైన గొడవ ఇందుకు కారణం… ఈ ఘటనతో ఢిల్లీ నగరం ఉలిక్కిపడింది.. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ద్వారకాలోని డాబ్రి ప్రాంతంలోని రోహ్తాష్ నగర్లో ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్.. సమీపంలోని దుకాణానికి…
రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు దేశంలో వాక్ స్వాతంత్య్రం అంతమైందని, యువత నిరుద్యోగులుగా మారుతున్నారని అన్నారు. ఆరు రోజుల క్రితం కొంత మంది యువకులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి పొగను విడుదల చేశారు.. దీంతో బీజేపీ ఎంపీలంతా పారిపోయి ఊపిరి పీల్చుకున్నారు అని రాహుల్ గాంధీ చమత్కరించారు.
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బరాఖంబా రోడ్డులోని గోపాల్ దాస్ భవనంలో మంటలు చెలరేగాయి. 8వ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మధ్యాహ్నం 1 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అగ్నిప్రమాదం సంభవించడంతో భవనంలో…
2024 సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. ఎన్నికల సమాయత్తంపై ఈరోజు సమావేశం నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో.. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, కీలక నాయకులు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని అంటున్నారు.. తెలుగు సత్తా చూపించేందుకు మోడీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు మోడీపై పోటీ చేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తనది గ్యారెంటీ అన్నారు. తనలాంటి వాడికి పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు.