Congress Meeting: రాబోయే పార్లమెంటు ఎన్నికల విధివిధానాలపై చర్చ జరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల అంశంపై చర్చించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పార్లమెంటు కో-ఆర్డినేటర్ల మీటింగ్ జరిగిందని చెప్పారు. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా కలసికట్టుగా పని చేశారో.. పార్లమెంట్ లో కూడా అదే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పారని తెలిపారు. మెజార్టీ సీట్లలో గెలవాలని దిశా నిర్దేశం చేశారన్నారు. దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుచుకో రావాల్సిన బాధ్యత కోఆర్డినేటర్ అని ఖర్గే చెప్పారని కొండా సురేఖ పేర్కొన్నారు.
Kishan Reddy: అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ట రాజకీయ కార్యక్రమం కాదు..
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల విధివిధానాలపై చర్చ జరిగిందని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే కొన్ని నియమ నిబంధనలు చెప్పారన్నారు. పార్టీలో ఉన్న వివిధ స్థాయి నేతలు చేయాల్సిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. కాగా.. నల్గొండ సీటు 3లక్షల ఓట్లతో గెలుస్తుంది.. 14 పార్లమెంట్ స్థానాలు పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పారన్నారు. అందరూ సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలంటూ సూచించారని ఉత్తమ్ కుమార్ తెలిపారు.
Google: గూగుల్‌లో మరోసారి లేఆఫ్.. వందలాది మంది ఉద్యోగుల తొలగింపు..
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ చేసామని తెలిపారు. ప్రచారం ఎలా ఉండాలి.. పోల్ మేనేజ్మెంట్, ప్రజలతో మమేకం అవ్వడంపై ఖర్గే మార్గానిర్ధేశం చేశారన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 17 కి 17 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని పొన్నం పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని అన్నారు. రెండు మూడు స్థానాలకోసం బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. 17కి 17 స్థానాల్లో గెలిపిస్తే ఆరు గ్యారెంటీలతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!