Republic Day Celebrations: దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య మార్గంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకముందు రాష్ట్రపతి ముర్ముకు, ఫ్యాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. అనంతరం కర్తవ్యపథ్‌లో జరుగుతున్న కవాతును రాష్ట్రపతి ముర్ముతో కలిసి మెక్రాన్ వీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్తవ్యపథ్‌లో జరుగుతున్న పరేడ్‌ను దేశ ప్రజలంతా ఆసక్తితో వీక్షిస్తున్నారు.
Read Also: Ajith: బిల్లా రోజులని గుర్తు చేస్తున్న కోలీవుడ్ సూపర్ స్టార్…
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్‌కు వచ్చారు. గురువారం ఇమ్మాన్యుయేల్ రాజస్థాన్‌లో పర్యటించారు. ప్రధాని మోడీతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. భారత్-ఫ్రాన్స్ మధ్య చిరకాల స్నేహ భావం ఉంది. ఇందులో భాగంగానే ఫ్యాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానించింది. గురువారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి.